bramohstavalu: సరస్వతి దేవి అలంకరణలో మలయప్పస్వామి !

వాహన సేవన లో టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించినో కళాబృందాల ప్రదర్శనలు భక్తులకు ఆధ్యాత్మికానందం కలిగించాయి.


Published Sep 26, 2025 04:52:59 AM
postImages/2025-09-26/1758865615_104475832.cms

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : శ్రీవారి బ్రహ్మాత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి, ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన గురువారం రాత్రి శ్రీమలయప్పస్వామి వారు సరస్వతి అలకారంలో వీణ ధరించి హంస వాహనంపై తిరుమాడవీధులల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. వాహన సేవన లో టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించినో కళాబృందాల ప్రదర్శనలు భక్తులకు ఆధ్యాత్మికానందం కలిగించాయి.


శ్రీవారి సాలకట్ల బ్రహ్మూత్సవాల్లో రెండవ రోజైన గురువారం రాత్రి హంసవాహన సేవ వాహనం పై స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. మాడవీధుల్లో అంగరంగవైభవంగా జరిగిన వాహనసేవలో వివిధ కళాబృందాలో ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. హంస వాహనసేవలో శ్రీమలయప్పస్వామి వారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. ఐతి హ్యానుసారం బ్రహ్మావాహనమైన హంస మేథస్సుకు  ప్రతీక . పాలను నీళ్లను వేరు చేసే విచక్షణ దీని స్వభావం . ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచిక . ఉపనిషత్తులు పరమాత్మతో సంయోంగం  చెందిన మహనీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి.


ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, అస్సాం, కేరళ, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఝార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాల నుంచి వచ్చిన మొత్తం 21 కళాబృందాలు 536 మంది కళాకారులు తమ ప్రత్యేక నృత్యాలు, వాయిద్యాలు, భజనలతో భక్తులను మంత్రముగ్ధుల్ని చేశారు. స్వామివారికి బ్రహ్మాత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రాత్రి 7 గంటలకు స్వామివారికి పందిరి సేవలతో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu ttd tirumala

Related Articles