జానీ మాస్టర్ అరెస్ట్ అవ్వడంతో జానీ మాస్టర్ భార్య మీడియా ముందుకు వచ్చి రచ్చ రచ్చ చేస్తుంది.ఆమె ఒక్కో ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక్కో విధమైన కామెంట్లు చేస్తుంది.అయితే తాజాగా ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో
న్యూస్ లైన్ డెస్క్: జానీ మాస్టర్ అరెస్ట్ అవ్వడంతో జానీ మాస్టర్ భార్య మీడియా ముందుకు వచ్చి రచ్చ రచ్చ చేస్తుంది.ఆమె ఒక్కో ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక్కో విధమైన కామెంట్లు చేస్తుంది.అయితే తాజాగా ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో జానీ మాస్టర్ భార్య మాట్లాడుతూ.. ఏ అమ్మాయి అయితే నా భర్త పై ఈ ఆరోపణలు చేసిందో అవన్నీ పూర్తిగా ఆవాస్తవం. ఆమె, ఆమె తల్లి పెద్ద సైకోలు. ఈ కథంతా ఆమె తల్లి వెనకుండి నడిపిస్తుంది.. జానీ మాస్టర్ ని బావ అని నన్ను మాత్రం బాబి అని పిలిచేది.
అయితే నన్ను బాబి అని పిలవడంతో నేను ఆమెను అనుమానించలేదు. కానీ ప్రతిసారి జానీ మాస్టర్ తో అసభ్యంగా ప్రవర్తించేది.అయినా కూడా ఏదో చిన్న పిల్ల తెలిసి తెలియని వయసు అని నేను చూసి చూడనట్లు వదిలేసాను.. జానీ మాస్టర్ ని పెళ్లి చేసుకోమని వేధించేది. అంతేకాదు అది కావాలి ఇది కావాలి అని ప్రతిసారి అడిగి డబ్బులు తీసుకునేది. ఇక నా భర్త నుండి గిఫ్టులు మాత్రమే కాదు డబ్బు,బంగారం అన్ని తీసుకుంది.
దానికి సంబంధించిన పక్కా ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి.. ఇక జానీ మాస్టర్ ని పెళ్లి చేసుకోమని వేధించడంతో ఈ విషయం నాకు తెలిసి నేను సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించాను.దాంతో నా పిల్లలు కూడా నాకు దూరం అయ్యారు. ఇక ఇష్యూ ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది అని నేరుగా ఆమె ఇంటికి వెళ్లే మందలించాను.ఆమె తల్లి సైకోలా ప్రవర్తించింది.ఇక ఆ టైంలో జానీ మాస్టర్ కూడా నాతోనే వచ్చారు.
నేను అంత మందలించినా కూడా జానీ మాస్టర్ దగ్గరికి ఆమె రావడంతో వెంటనే నేను ఆమెను కొట్టడానికి ప్రయత్నించాను. ఎందుకంటే నా భర్త దగ్గరికి వస్తే నేను ఓర్వలేకపోయాను. ఇక ప్రస్తుతం ఎవరైతే ఆ అమ్మాయికి సపోర్ట్ ఇస్తున్నారో వాళ్లు కూడా త్వరలోనే రోడ్డుమీదికి వస్తారు.వాళ్ల బాగోతం కూడా బయటపడుతుంది. ఆమె ఖచ్చితంగా నా భర్తను హనీ ట్రాప్ చేసింది అంటూ సంచలన విషయాలు బయట పెట్టింది జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ ఆయేషా.