Laxmi Devi:ఈ 5 సంకేతాలు కనిపిస్తే మీకు ధనప్రాప్తి కలగబోతుందని అర్థం.!

భారతదేశంలో ఎక్కువమంది  దేవుళ్ళను నమ్ముతూ ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే మనకు అద్భుతమైన సంపద వస్తుందని భావిస్తూ ఉంటారు.  అలాంటి లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చేముందు కొన్ని సాంకేతాలు ఇస్తుందట. మరి ఆ సాంకేతాలేంటి ఆ వివరాలు ఏంటో చూద్దాం. 


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-22/1721616835_laxmi.jpg

న్యూస్ లైన్ డెస్క్: భారతదేశంలో ఎక్కువమంది  దేవుళ్ళను నమ్ముతూ ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే మనకు అద్భుతమైన సంపద వస్తుందని భావిస్తూ ఉంటారు.  అలాంటి లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చేముందు కొన్ని సాంకేతాలు ఇస్తుందట. మరి ఆ సాంకేతాలేంటి ఆ వివరాలు ఏంటో చూద్దాం. 

#1. నల్ల చీమలు:
 ముఖ్యంగా ఇంట్లోకి ఏకధాటిగా నల్ల చీమలు వచ్చి ఏదైనా ఆహార పదార్థాన్ని గుంపుగా తిన్నట్లయితే, లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాబోతోందని అర్థం. మీకు ఎక్కువ ధన ప్రాప్తి కలగబోతోందని మీరు గమనించాలి. 

#2. పక్షి గూడు:
 మీ ఇంటి ఆవరణలో ఏదైనా పక్షి వచ్చి గూడు కట్టుకుంటున్నట్లయితే శుభసంకేతంగా  పరిగణించాలి. త్వరలోనే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతోందని అర్థం చేసుకోవాలి. కానీ మీరు ఆ గుడును తీసేసి పక్కకు పడేసే ప్రయత్నం చేయకండి. దీని వల్ల లక్ష్మీదేవి వెనిదిరిగి వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ గూడు దగ్గర ఏవైనా విత్తనాలు ఉంటే వేసి  పక్షి కడుపు నింపండి. దీనివల్ల లక్ష్మీ అనుగ్రహం కలిగి మీరు మరింత ధనవంతులవుతారు. 

#3. మూడు బల్లులు:
 మీ ఇంట్లో ఒకే చోట వరుస క్రమంలో మూడు బల్లులు కనిపించినట్లయితే అది శుభసంకేతంగా చెప్పవచ్చు. ముఖ్యంగా లక్ష్మీదేవి వచ్చే ముందు ఈ సాంకేతాలు తప్పక ఇస్తుంది. చూసి చాలా మంది చిరాకు పడుతూ ఉంటారు. కానీ బల్లి లక్ష్మీదేవి స్వరూపం. మూడు బల్లులు వరుస క్రమంలో కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెడుతోందని, మీకు ధన ప్రాప్తి కలగబోతోందని అర్థం చేసుకోవాలి. 

#4. కుడి చేతిలో దురద:
 ఈ కుడి చేతిలో నిరంతరం దురద పుడితే మీకు ఆర్థికపరమైన లాభాలు వస్తాయని అర్థం చేసుకోవాలి. చాలామంది ఈ దురద పుడుతుంటే దానికి అర్థం తెలియక ఆందోళన చెందుతూ ఉంటారు. కుడి చేతిలో నిరంతరం దురద పుడితే  నీకు త్వరలోనే ధన ప్రాప్తి కలగబోతుందని అర్థం చేసుకోవాలి. 

#5. శంఖ శబ్దం:
మీరు ఉదయం లేచిన వెంటనే శంఖానికి సంబంధించిన శబ్దాలు వినిపించినట్లయితే మీకు మంచి కలగబోతోందని అర్థం. లక్ష్మీదేవి మీపై అనుగ్రహం చూపబోతోందని త్వరలోనే ధనప్రాప్తి కలుగుతుందని అర్థం చేసుకోవాలి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu laxmidevi money leazard

Related Articles