ramsetu: అవును ..రామాయణం నిజమే...రామసేతూ నిజమే ..ఇస్రో చెప్పిన నిజాలు!

జై శ్రీరామ్ ..ముందు మనం ఈ మాట చెప్పాల్సిందే. ఎన్నో వేల సంవత్సరాల నుంచి ప్రతి హిందువు నమ్మాడు రాముడున్నాడని...ఈ నేల పై నడిచాడని...సీతమ్మ కథలు నిజమని...హనుమాన్ ధైర్యం నిజమని ...లక్ష్మణుడి భక్తి కల్మషం లేదు..ఇదంతా నిజమని నిర్దారణ అయ్యింది. రామాయణంలో చెప్పిన రామసేతు వంతెన నిజమని తేల్చేసింది. భారత్ శ్రీలంక మధ్య సముద్రంలో రామసేతు ఉంది అని ఇస్రో శాస్త్రవేత్తలు నిర్ధారించే మ్యాపులు ఫోటోలు విడుదల చేశారు. అది కూడా కరెక్ట్ గా రాముల వారి ఆనవాళ్లు ఉన్న సంవత్సరాలు ..ఈ రామసేతు కూడా అదే ఏడాది ఏర్పడిందని నాసా వాళ్లు తెలిపారు.


Published Jul 16, 2024 03:47:00 PM
postImages/2024-07-16/1721125082_images3.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: జై శ్రీరామ్ ..ముందు మనం ఈ మాట చెప్పాల్సిందే. ఎన్నో వేల సంవత్సరాల నుంచి ప్రతి హిందువు నమ్మాడు రాముడున్నాడని...ఈ నేల పై నడిచాడని...సీతమ్మ కథలు నిజమని...హనుమాన్ ధైర్యం నిజమని ...లక్ష్మణుడి భక్తి కల్మషం లేదు..ఇదంతా నిజమని నిర్దారణ అయ్యింది. రామాయణంలో చెప్పిన రామసేతు వంతెన నిజమని తేల్చేసింది. భారత్ శ్రీలంక మధ్య సముద్రంలో రామసేతు ఉంది అని ఇస్రో శాస్త్రవేత్తలు నిర్ధారించే మ్యాపులు ఫోటోలు విడుదల చేశారు. అది కూడా కరెక్ట్ గా రాముల వారి ఆనవాళ్లు ఉన్న సంవత్సరాలు ..ఈ రామసేతు కూడా అదే ఏడాది ఏర్పడిందని నాసా వాళ్లు తెలిపారు.


అమెరికాకు చెందిన ఐస్‌శాట్ – 2 డేటాను వినియోగించి తమిళనాడులోని ఈ వంతెన పూర్తి వివరాలు వెలికి తీశారు. భారత్, శ్రీలంక మధ్య ఉండే ఈ వంతెన పొడవు 29 కిలోమీటర్ల మేర ఉంది. దీని ఎత్తు సముద్రగర్భం నుంచి 8 మీటర్లు ఉన్నట్టు నిర్ధారించారు. ఈ వంతెన తమిళనాడులోని రామేశ్వరం ద్వీపం ఆగ్నేయ దిక్కులోని ధనుష్కోడి నుంచి …‌ శ్రీలంక మన్నారు ద్వీపంలోని తలైమన్నార్ వాయవ్య దిశ వరకూ విస్తరించి ఉంది. దీనిని సున్నపురాతితో నిర్మించినట్టు తెలుసుకున్నారు. ప్రస్తుతం ఈ వంతెన 99.98 శాతం నీటిలో మునిగి ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.


ఈ వంతెనకు సంబంధించిన ఫొటోలను తాజాగా విడుదల చేసింది. ఇస్రో రూపొందించిన పది మీటర్ల మ్యాప్‌లో మొత్తం వంతెన కనిపిస్తుండడం విశేషం. రామేశ్వరం ఆలయ రికార్డుల ప్రకారం.. ఈ వంతెన 1480 దాకా పటిష్టంగానే ఉంది కానీ ఆ సమయంలో వచ్చిన భయంకర తుఫానులతో ధ్వంసమైంది. అందుకే ఈ రామసేతు శిధిలమయిపోయింది.సముద్రంపై ఈ వంతెనను వానరసేన నిర్మించింది. ఆ సేతుపై నుంచే వానరసేన లంకకు చేరుకుంది. 


ఈ వంతెన 1480 దాకా పటిష్టంగానే ఉంది కానీ ఆ సమయంలో వచ్చిన భయంకర తుఫానులతో ధ్వంసమైంది. ఇప్పటికీ కూడా సముద్రం లోపల ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఇంకా క్లియర్ గా రామాయణం నిజమేనని తేల్చింది. రామసేతు నిజమంటే ..రామాయణం కూడా నిజమేనంటున్నారు హిందూ సోదరులు
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu rama tamilanadu

Related Articles