JANVI KAPOOR: రేటు పెంచిన జాన్వీ కపూర్ ..షాక్ లో నిర్మాతలు ?

ఆమె రెమ్యూనరేషన్ విషయంలో కూడా  ఆమె నిర్మాతలకు షాక్ ఇస్తుందట. ఇంకా రిలీజ్ కూడా కాలేదు అప్పడే రెమ్యూనిరేషన్ ను దారుణంగా అడుగుతుందట.


Published Sep 22, 2024 07:12:00 PM
postImages/2024-09-22/1727012581_2501322janhvikapoorart.avif

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: జాన్వీ కపూర్ కు బాలీవుడ్ లో పెద్దగా మార్కెట్ లేదు. కాని టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడు అడుగులేస్తుంది. ఇంకా ఎన్టీఆర్ తో సినిమా రిలీజ్ అవ్వలేదు. అమ్మడు యాక్టింగ్ స్కిల్స్ తెలుగు వాళ్లకు తెలీదు. కాని రెమ్యూనిరేషన్ మాత్రం పెంచేసింది.తల్లి శ్రీదేవి కోరిక మేరకు మాత్రమే సౌత్ సినిమాలు చేస్తున్నట్లు తెలిపారు.ఆమె రెమ్యూనరేషన్ విషయంలో కూడా  ఆమె నిర్మాతలకు షాక్ ఇస్తుందట. ఇంకా రిలీజ్ కూడా కాలేదు అప్పడే రెమ్యూనిరేషన్ ను దారుణంగా అడుగుతుందట.


బాలీవుడ్ లో ఆర్ట్ మూవీస్ చేస్తున్న జాన్వీ.. తెలుగు సినిమాతోనే కమర్షియల్ హీరోయిన్ గా గుర్తింపు సాధించబోతోంది. అంతే కాదు బాలీవుడ్ లో సినిమాలకు ఆమెకు రెండు కోట్లకు మించి రెమ్యూనరేషనర్ ఇవ్వడంలేదు అని తెలుస్తోంది. కాని దేవర సినిమాకు ఆమె 4 కోట్లు తీసుకుంది. ఇప్పుడు మరింత పెంచి  ఏడు నుంచి 8 కోట్లు రెమ్యూనిరేషన్ అడుగుతుందని టాక్. పాన్ ఇండియా ఇమేజ్ తో పాటు.. డబుల్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న జాన్వీ కపూర్ కు దేవర సినిమా హిట్ అయితే టాలీవుడ్ చాలా మేలు చేసినట్టే అవుతుంది. బుచ్చిబాబుతో రామ్ చరణ్ సినిమాకు 10 కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకుంటుందని టాక్ నడుస్తుంది. అయితే 8 కోట్లు అడిగిందని చెబుతున్నా ...రెండో సినిమాకే 8 కోట్లు చాలా ఎక్కువ అంటున్నారు సినీ నిర్మాతలు. అమ్మడు ఇలానే ఉంటే గట్టిగా ఓ 5 సినిమాలకే అమ్మడుని లైట్ తీసుకుంటారంటున్నారు.


ఆమధ్య గట్టిగా ఊపు ఊపేసిన పూజా హెగ్డే పరిస్థితి ఇప్పుడు ఏంటో అందరూ చూస్తునే ఉన్నారు. పోజు కొడితే జాన్వీకి పూజాకు పట్టిన పరిస్థితే వస్తుంది . తెలివిగా వ్యవహరిస్తే తెలుగులో స్టార్ అవుతుంది. మంచి సినిమాలు చేస్తుంది లేదంటే లైట్ తీసుకుంటారు.

newsline-whatsapp-channel
Tags : buchibabu janhvi-kapoor ramcharan remuniration

Related Articles