RakulPreet:రకుల్ విడాకులు వేణు స్వామి షాకింగ్ కామెంట్స్.!

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. సినీ రాజకీయ ప్రముఖుల యొక్క జ్యోతిష్యాలు చెబుతూ ఎంతో ఫేమస్ అయ్యాడు. ఈయన చెప్పిన కొన్ని


Published Aug 17, 2024 11:37:13 AM
postImages/2024-08-17/1723874833_rakulpreet.jpg

న్యూస్ లైన్ డెస్క్: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. సినీ రాజకీయ ప్రముఖుల యొక్క జ్యోతిష్యాలు చెబుతూ ఎంతో ఫేమస్ అయ్యాడు. ఈయన చెప్పిన కొన్ని విషయాలు అక్షరాల నిజాలు అయ్యాయి. కొంతమంది హీరోయిన్ల పూజలు చేసుకుని ఇండస్ట్రీలో టాప్ లెవెల్ లోకి వెళ్లిపోయారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రష్మిక మందాన. ఈమె కెరియర్ మొదట్లో బాగా లేకపోతే వేణు స్వామి పూజ చేశాడు ఆ తర్వాత టాప్ లెవెల్ లోకి వెళ్లిపోయింది.  

అలా అప్పటినుంచి చాలామంది హీరోయిన్ల సినీ లైఫ్ సెట్ చేసిన దాంట్లో వేణు స్వామి కీలకపాత్ర పోషించారని చెప్పవచ్చు. అంతేకాకుండా సమంత నాగచైతన్య విడిపోతారని ఆయన ముందుగానే చెప్పారు. చెప్పిన విధంగానే వీరు మూడు సంవత్సరాలకు పైగా కాపురం చేసి విడాకుల ద్వారా విడిపోయారు. ఇక అప్పటినుంచి వేణు స్వామి అంటే చాలా మందికి నమ్మకం ఏర్పడింది. సినీ రాజకీయ, ప్రముఖుల జాతకాలు చెబుతూ ఎంతో ఫేమస్ అయినటువంటి వేణు స్వామి  తాజాగా నాగచైతన్య పై మరో కామెంట్స్ కూడా చేశారు. ఈయన శోభిత ధూళిపాళ్లతో కూడా  విడిపోతారని అన్నారు. దీంతో వేణు స్వామిపై పెద్ద ఎత్తున ట్రోల్ జరుగుతుంది.

 ఇదిలా ఉండగానే తాజాగా ఆయన మరో స్టార్ హీరోయిన్ అయినటువంటి రకుల్ ప్రీత్ సింగ్  గురించి కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు.  రకుల్ ప్రీత్ సింగ్ తన భర్తతో ఎంగేజ్మెంట్ జరుపుకుంటున్న సమయంలోనే వీరిద్దరు విడిపోతారని రకుల్ భర్త జాకీ బాగ్నాని అప్పుల్లో కూరుకు పోతారని  చెప్పారు.  ఆయన చెప్పినట్టుగానే రకుల్ భర్త అప్పుల కూరుకుపోయారు.  అంతే కాదు వీరిద్దరూ విడాకులు కూడా తీసుకోబోతున్నారని  ప్రస్తుతం వార్తలు వినిపిస్తున్నాయి. అప్పట్లో వేణు స్వామి చెప్పిన మాటలను మరోసారి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu divorce venuswamy rakul-preet-singh jocky-bagnani

Related Articles