Sharwanand: భార్యకి శర్వానంద్ విడాకులు నిజమేనా.?

తెలుగు ఇండస్ట్రీలో హీరో శర్వానంద్ అంటే తెలియని వారు ఉండరు. సినిమాల్లో హిట్స్ ప్లాప్స్ అనే తేడా లేకుండా  వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు. అలాంటి శర్వానంద్  2023 వివాహం చేసుకున్నాడు.


Published Aug 13, 2024 09:34:20 PM
postImages/2024-08-13/1723565060_sharwanandwife.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు ఇండస్ట్రీలో హీరో శర్వానంద్ అంటే తెలియని వారు ఉండరు. సినిమాల్లో హిట్స్ ప్లాప్స్ అనే తేడా లేకుండా  వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు. అలాంటి శర్వానంద్  2023 వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయనకు ఒక పాప కూడా పుట్టింది. హ్యాపీ జీవితం గడుపుతున్న సందర్భంలో సడన్ గా  వీరి మధ్య విడాకులు అనే ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజంగానే శర్వానంద్ తన భార్యకు విడాకులు ఇవ్వబోతున్నారా అసలు జరిగిన విషయం ఏంటి అనే వివరాలు చూద్దాం..

తెలుగు ఇండస్ట్రీలో  ఓ మోస్తారు హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు శర్వానంద్.  చాలా వెరైటీ కథలున్నటువంటి సినిమాలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నారు. అయితే గత సంవత్సరం శర్వానంద్ నటించిన మనమే అనే మూవీ  ఫ్లాప్ అయినా కానీ   వరుస ప్రాజెక్టులు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ విధంగా శర్వానంద్ సినిమాల్లో దూసుకుపోతున్న తరుణంలో తాజాగా ఆయన భార్యతో విడాకులు తీసుకుంటున్నారు అనే ఒక చర్చ సాగుతోంది. అయితే విడాకులు అంటే చాలామంది  తన సొంత భార్యతో విడాకులు అని అనుకుంటారు.

కానీ అలా అనుకుంటే తప్పే  నిజానికి శర్వానంద్ అనేది తన భార్యతో విడాకులు తీసుకోవడం లేదు. త్వరలో శర్వానంద్ కొత్త ప్రాజెక్టు చేయబోతున్నారట. ఆ సినిమా మొత్తం విడాకులు చుట్టే తిరుగుతుందట. ఈ చిత్రంలో శర్వానంద్  విడాకులు  తీసుకునే సన్నివేశం ఉంటుందట. ముఖ్యంగా ఈ చిత్రంలో విడాకుల గురించి ఎక్కువగా కాన్సెప్ట్ ఉంటుందని తెలుస్తోంది. దీన్ని బేస్ చేసుకుని చాలా మంది శర్వానంద్ తన భార్యతో విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు రాస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu divorce wife sharwanandh

Related Articles