Shobitha : ఆ జాబితాలో చేరిన శోభిత.. నిశ్చితార్థం అవగానే ఇలా జరిగిందంటే..

నిశ్చితార్థం అయిందో లేదో శోభితాను అదృష్టం వరించింది. అక్కినేని వారింటద అడుగు పెట్టగానే అదృష్టం వెతుక్కుంటూ వచ్చిందంటూ పలువురు శోభితాను శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు.


Published Aug 13, 2024 01:54:33 PM
postImages/2024-08-13/1723537473_shobitha.jpg

 

న్యూస్ లైన్ సినిమా : శోభితా ధూళిపాళ్ల.. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. మిస్సిండియా అందాల పోటీలో పాల్గొని దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్ పదహారణాల తెలుగమ్మాయి. రామన్ రాఘవన్ సినిమాలతో నేరుగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శోభితా సంప్రదాయ నృత్యాల్లో కూడా దిట్ట. అడివిశేష్ తో కలిసి గూఢచారి, మేజర్ సినిమాలతో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా టాలీవుడ్ కింగ్ నాగార్జున తనయుడు నాగచైతన్యతో ఎంగేజ్ మెంట్ చేసుకొని పెళ్లి కన్ఫర్మ్ చేసుకుంది.

ఇలా నిశ్చితార్థం అయిందో లేదో శోభితాను అదృష్టం వరించింది. అక్కినేని వారింటద అడుగు పెట్టగానే అదృష్టం వెతుక్కుంటూ వచ్చిందంటూ పలువురు శోభితాను శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు. ప్రముఖ ఎంటర్టైన్ మెంట్ పోర్టల్ ఐఎంబీడీ రిలీజ్ చేసిన ఇండిన్ సెలెబ్రిటీల లిస్టులో శోభితా ధూళిపాళ్ల రెండో స్థానంలో నిలిచింది. శార్వరీ వాఘ్ తొలిస్థానంలో నిలవగా.. శోభితా రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఈ లిస్టులో టాప్ 3లో షారుక్ ఖాన్, టాప్ 4లో కాజోల్, టాప్ 5లో జాన్వీ కపూర్ నిలిచారు. అయితే.. షారుఖ్ ఖాన్ ని వెనక్కి నెట్టేసి టాప్ 2కి చేరడం అందరిని విస్మయపరిచింది.

సమంతాతో నాగచైతన్య విడాకులు తీసుకున్న తర్వాత 2022 నుంచి శోభితా..చైతూతో డేటింగ్ లో ఉన్నారు. గతేడాది ఇద్దరూ కలిసి లండన్ లో చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. లండన్ లో కలిసి భోజనం చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అప్పటి నుంచి వీరిద్దరిపై సోషల్ మీడియాలో తెగ కథనాలు చక్కర్లు కొట్టాయి. కాగా.. రూమర్లకు చెక్ పెడుతూ ఆగష్టు 8న చైతూ – శోభితల నిశ్చితార్థం జరిగింది. అయితే ఇంకా పెళ్లి డేట్ మాత్రం ఫిక్స్ కాలేదు. ఇదిలా ఉంటే.. అక్కినేని వారింట అడుగు పెట్టగానే దేశంలోనే ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ పోర్టల్ లో శోభితా రెండోస్థానంలో నిలవడం ఆ రెండు కుటుంబాల్లో ఆనందాలు నింపింది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu nagarjuna movies movie-news samantha nagachaitanya latest-news news-updates nagachaitanya- cinema-news bigboss--buzz-host

Related Articles