శోభిత అడుగు..నాగార్జున ఇంట్లో హైడ్రా పిడుగు.. ఐరన్ లెగ్ అంటున్న నేటిజన్స్.!

నాగార్జున తెలుగు సినిమా ఇండస్ట్రీలో  తిరుగులేని హీరో. అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున మంచి స్థాయిలో ఉన్నారు. ఆయన నట వారసులుగా అక్కినేని


Published Aug 24, 2024 10:59:02 AM
postImages/2024-08-24/1724477342_convension.jpg

న్యూస్ లైన్ డెస్క్: నాగార్జున తెలుగు సినిమా ఇండస్ట్రీలో  తిరుగులేని హీరో. అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున మంచి స్థాయిలో ఉన్నారు. ఆయన నట వారసులుగా అక్కినేని నాగచైతన్య, అఖిల్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి హీరోలుగా కొనసాగుతున్నారు.  అలాంటి నాగర్జున కేవలం సినిమాల ద్వారానే అన్నపూర్ణ స్టూడియో, పలు బిజినెస్ లు, టీవీ చానల్స్ ఇలా ఎన్నో రంగాల్లో ఆయన రాణిస్తున్నారు. రెండు చేతుల సంపాదిస్తున్న నాగార్జున సొంత కెరియర్ మాత్రం బాగానే ఉంది. తన కొడుకుల విషయంలో మాత్రం ఇప్పటికీ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.

ఇందులో నాగచైతన్య ఓ మోస్తారుగా దూసుకుపోతున్న అఖిల్ మాత్రం దారుణంగా విఫలమవుతున్నారు. ఇక నాగచైతన్య  తను ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక అప్పటినుంచి ఇద్దరు వేరువేరుగానే ఉంటూ సినిమాలపై దృష్టి పెట్టారు. ఇదే తరుణంలో నాగచైతన్య శోభిత ధూళిపాళ్లతో లవ్ లో పడి చివరికి ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు.  నాగచైతన్య శోభితతో ఎప్పుడైతే ఎంగేజ్మెంట్ చేసుకున్నాడో అప్పటినుంచి సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి.

ఇలా వీరి వార్త మరువకముందే  నాగార్జున ఆస్తులపై హైడ్రా కొరడా  జులిపించింది. నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ కు సంబంధించి కూల్చివేతలు జరుగుతున్నాయి. ఇదే తరుణంలో కొంతమంది నాగార్జున అంటే పడని వారు కొన్ని ఫేక్ వార్తలు క్రియేట్ చేసి శోభితపై నెగటివ్ చేస్తున్నారు. శోభిత నాగార్జున ఇంట్లో ఎప్పుడైతే అడుగు పెట్టిందో అప్పటినుంచి నష్టాలే జరుగుతున్నాయని, తన ప్రాపర్టీలలో ఎన్ కన్వెన్షన్ హాల్  లాస్ కావలసి వచ్చిందని, శోభిత ఐరన్ లెగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి దీనిపై నాగార్జున ఫ్యామిలీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu nagarjuna akhil-akkineni nagachaitanya- sobhita-dhulipala n-convension-hall hydra

Related Articles