Jr ntr:ఆనాటి రాముడు ఈనాటి మనవడు..నందమూరి హీరోలతో శ్రీదేవి జాన్వి.!

అన్న ఎన్టీఆర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనాలు సృష్టించినటువంటి కథానాయకుడు. అలాంటి సీనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ లో ప్రముఖ పాత్ర పోషించారు. ఆయన తెలుగు ఇండస్ట్రీలో


Published Aug 06, 2024 11:16:00 AM
postImages/2024-08-06/1722922643_jrntrdevara1.jpg

న్యూస్ లైన్ డెస్క్: అన్న ఎన్టీఆర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనాలు సృష్టించినటువంటి కథానాయకుడు. అలాంటి సీనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ లో ప్రముఖ పాత్ర పోషించారు. ఆయన తెలుగు ఇండస్ట్రీలో చేయని పాత్ర లేదు. ఎన్నో పాత్రల్లో నటించి  అధరహో అనిపించారు. అలా ఎన్టీఆర్  శ్రీదేవితో కూడా చాలా చిత్రాల్లో  చేశాడు. అయితే శ్రీదేవి  ఎన్టీఆర్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి చివరికి ఆయనతోనే హీరోయిన్ గా కూడా నటించింది.  అలా వీరిద్దరి కాంబోలో  నెంబర్ ఆఫ్ సినిమాలు వచ్చాయి.

ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆటగాడు,  రౌడీ రాముడు, కొంటె కృష్ణుడు,  సర్దార్ పాపారాయుడు, గజదొంగ, అగ్గి రవ్వ, కొండవీటి సింహం, అనురాగ దేవత, జస్టిస్ చౌదరి, బొబ్బిలి పులి,  వయ్యారి భామలు, వగలమారి భర్తలు అనే చిత్రాల్లో నటించింది. ఇలా వీరిద్దరి కాంబోలో  వచ్చిన ప్రతి చిత్రం సూపర్ హిట్ అయింది. అలా ఎన్టీఆర్ తో శ్రీదేవి  నటిస్తే ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ కూడా శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ తో సినిమా చేస్తున్నారు.

అలనాడు తాత ఎన్టీఆర్ తో శ్రీదేవి కాంబో ఎలా ఉండేదో,  ఇప్పుడు మనవడి తో శ్రీదేవి కూతురు జాన్వి కాంబో కూడా అలాగే ఉండబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా సెకండ్ సాంగ్ కూడా  తాజాగా రిలీజ్ అయి సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా కోసం నందమూరి అభిమానులంతా కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : news-line jr-ntr sr-ntr devara johnvi-kapoor sridevi

Related Articles