DEVOTIONAL : డిసెంబర్​ 7 సుబ్రహ్మణ్య షష్ఠి !

షష్టి డిసెంబర్ 7 సూర్యోదయానికి ఉంటుంది కాబట్టి పూజ కూడా 7వ తారీఖున చెయ్యాలి.  


Published Dec 04, 2024 07:00:00 PM
postImages/2024-12-04/1733319058_subramanyam.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: హిందూ మతంలో శ్రీ సుబ్రమణ్య స్వామి ఆరాధనకు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. సుబ్రమణ్యస్వామి ఆరాధన ఆటంకాలను దూరం చేస్తుందని పురాణాల్లో ఉంది. ప్రతి మాసంలో వచ్చే షష్టికి సుబ్రమణ్యఆరాధన చాలా మంచిది.మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యుని జన్మదినంగా జరుపుకుంటారు. 


డిసెంబర్ 6 శుక్రవారం మధ్యాహ్నం 12:07 గంటలకు మొదలై డిసెంబర్ 7 మధ్యాహ్నం 11:05 నిమిషాల వరకు ఉంటుంది. అయితే ఏ రోజైతే సుర్యోదయం టైంలో ఆ తిధి నడుస్తుందో ఆ రోజే పూజ జరిపిస్తారు. షష్టి డిసెంబర్ 7 సూర్యోదయానికి ఉంటుంది కాబట్టి పూజ కూడా 7వ తారీఖున చెయ్యాలి.  ఈ షష్టి పూజలు వల్ల రాహు కేతు దోషాలు, కాలసర్ప దోషాలు , కుజ దోషాలన్నింటిని దూరం చేస్తుంది.  అంతేకాదు రుణ బాధలు కూడా పోతాయని చెబుతారు.
సుబ్రహ్మణ్య షష్టి నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఇంట్లో పూజామందిరాన్ని శుభ్రం చేసుకొని నిత్య పూజాదికాలు పూర్తి చేసుకోవాలి.  స్వామి వారికి ఎర్రని పూలు సమర్పించాలి. 


నవగ్రహాల్లో కుజుడికి అధిష్ఠాన దేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి కుజుడికి సంకేతంగా 9 వత్తులను విడిగా వేసి దీపం వెలిగించాలి. మీకు ఎర్రని పూలు అందుబాటులో లేకపోతే ..ఎర్రని కుంకుమ అక్షింతలతో పూజ చెయ్యండి. స్వామి వారికి 108 నామాలు చదవలేని వారు "ఓం సాం శరవణ భవా" అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేసుకోవాలి. ఈ మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు వీలుని బట్టి జపించాలి.


సుబ్రమణ్యస్వామి వారి ప్రసాదం వడపప్పు, పానకం , కందిపప్పు తో చేసిన పదార్ధాలను నైవేద్యంగా సమర్పించాలి. మీరు ఇన్ని చెయ్యలేకపోతే దానిమ్మగింజలు అయినా నైవేద్యంగా పెట్టొచ్చు.ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వసంపదలు లభిస్తాయని, ఆవు పెరుగుతో అభిషేకిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని, తేనెతో అభిషేకం చేస్తే కళారంగంలో విజయం సాధిస్తారని, ఆవు నెయ్యితో అభిషేకం చేయిస్తే అన్ని రకాలైన ఆకస్మిక సమస్యలు తొలగిపోతాయని చెబుతున్నారు. పంచదార నీటితో చేస్తే సమస్త కష్టాలు తీరిపోతాయని వివరిస్తున్నారు. అలాగే అప్పులతో ఇబ్బంది పడే వారు బియ్యప్పిండితో అభిషేకిస్తే మంచిదంటున్నారు. గరిక కలిగిన నీటితో అభిషేకం చేస్తే పోగొట్టుకున్న ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి కలుగుతుంది. ఇలా మీ శక్తి కొలది మీరు పూజలు చెయ్యండి.


 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu shivalayam pooja

Related Articles