ఈ సినిమాకు నాని నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌తో కలిసి నాని తన యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : మెగాస్టార్ చిరు నెక్స్ట్ సినిమాను నాని సెట్ చేసేశాడు. మ్యాటర్ ఏంటంటే 'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెల డైరక్షన్ లో చిరంజీవి సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు నాని నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌తో కలిసి నాని తన యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
ఇన్నాళ్లు ఈ సినిమా పుకార్లు నడిచేవి..కాని ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఓ స్పెషల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో రక్తం కారుతున్న చెయ్యిని చూపించారు. దీనికి అతను హింసలో శాంతిని పొందుతాడనే క్యాప్షన్ ను ఇచ్చారు. "ఆయన స్ఫూర్తితోనే నేను పెరిగాను. ప్రతిసారి ఆయన కోసం గంటల తరబడి లైన్‌లో నిలబడ్డాను. ఆ టైంలో నా సైకిల్ పోయింది. ఇప్పుడు ఆయనతోనే నిలబడి ..మాట్లాడి ..పనిచేస్తున్నా ఇది ఫుల్ సర్కిల్ అంటూ నాని ట్వీట్ చేశారు.
ఇదిలావుంచితే, తన మొదటి సినిమా ‘దసరా’ తర్వాత మరోసారి నానినే శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ‘ది పారడైజ్’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. ఈ సినిమా కంప్లీట్ అవ్వగానే మెగాస్టార్ తో సినిమా స్టార్ట్ అవుతుంది. శ్రీకాంత్ ఓదెల సినిమా ప్రారంభం అవుతుంది. మరో వైపు మల్లిడి వశిష్ట డైరక్షన్ లో చిరు నటిస్తున్న విశ్వంభర సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కు రెడీ గా ఉంది.