పుష్ప డైలాగ్స్ రీల్స్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు . ఈ కేటగిరీలో పాయల్ రాజ్ పుత్ కూడా యాడ్ అయ్యారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా దాదాపు 80 దేశాల్లో పుష్పరాజ్ మానియా నడుస్తుంది. సుకుమార్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా టాలీవుడ్ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్ టైటిల్ రోల్ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ రోజు అర్ధరాత్రి నుంచి పుష్పరాజ్ హంగామా షురూ అయిపోతుంది. అప్పుడే పుష్ప డైలాగ్స్ రీల్స్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు . ఈ కేటగిరీలో పాయల్ రాజ్ పుత్ కూడా యాడ్ అయ్యారు.
పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా.. వైల్డ్ ఫైర్ అంటూ సాగే డైలాగ్స్‌ను పాయల్ రాజ్ పుత్ ఈ డైలాగ్ డబ్ స్మాష్ వీడియో చేసింది. గ్లామర్‌తో మెస్మరైజ్ చేస్తూ పుష్పరాజ్ స్టైల్‌లో ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ సేమ్ డైలాగ్‌ను చెప్పింది. ఏమైనా పాయల్ బ్యూటీకి ఈ డైలాగ్ భలే ముద్దుగా ఉందంటున్నారు నెటిజన్లు.
మరికొన్ని గంటల్లో ప్రీమియర్ షఓస్ పడిపోతాయి. సీక్వెల్‌లో ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
#PayalRajput enacts #WildFire dialogue from #Pushpa2TheRule !