మునీర్ ఖాన్ 1996లో UPలోని లఖింపూర్ ఖేరీలోని చిన్న పట్టణమైన గౌరియాలో జన్మించాడు. అతని ప్రాథమిక విద్య గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో సాగింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఓ సాధారణ గవర్నమెంట్ స్కూల్ లో చదివిన కుర్రాడు ఇంత ప్రత్యేకమైన టెక్నాలజీని కనిపెట్టగలరని ఎవరైనా అనుకోగలరా. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 'యంగ్ సైంటిస్ట్' మునీర్ ఖాన్ తన ప్రతిభ, సాంకేతిక నైపుణ్యాలతో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. ఏఐ సహాయంతో అంధుల కోసం ఓ ప్రత్యేకమైన అద్దాలను కనిపెట్టాడు. ఆ అద్దాలు డిసెంబరు 17 నుండి 19 వరకు జరగనున్న IIT బాంబే యొక్క టెక్‌ఫెస్ట్‌లో మొదటిసారిగా ఈ వినూత్న గ్లాసెస్ ప్రజలకు ప్రదర్శించబడతాయని మునీర్ తెలిపారు. ఈ కార్యక్రమం దృష్టిలోపం ఉన్నవారికి చాలా హెల్ప్ అవుతుందని తెలిపారు.
'AI-విజన్ ప్రో' అనే AI- పవర్డ్ గ్లాసెస్ ఏం చేస్తాయంటే ఈ అద్దాలు అంధుల ముఖాలను గుర్తించడానికి, మందులు మరియు ఆహార పదార్థాల మధ్య తేడాను గుర్తించడానికి, అలాగే నడిచేటప్పుడు అడ్డంకులను గుర్తించడానికి వీలు కల్పిస్తాయి. అదనంగా, వారు ప్రింటెడ్ మెటీరియల్ యొక్క అర్థాన్ని చదవగలరు, అర్థం చేసుకోగలరు. ప్రయాణంలో ఉన్నప్పుడు అడ్డంకులను గుర్తించగలరు. దాదాపుగా వీరికి కావాల్సిన అన్ని పనులు వారు ఫీల్ అవుతూ వాటిని చూడగలరు.
మునీర్ ఖాన్ 1996లో UPలోని లఖింపూర్ ఖేరీలోని చిన్న పట్టణమైన గౌరియాలో జన్మించాడు. అతని ప్రాథమిక విద్య గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో సాగింది. ఫ్రాన్స్ మరియు రష్యాలో తన ఇంటర్న్‌షిప్ సమయంలో, మునీర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు సెన్సార్ టెక్నాలజీపై తీవ్ర ఆసక్తిని పెంచుకున్నాడు.
* డీహైడ్రేషన్ ను గుర్తించే వాటర్ బాటిల్ కనిపెట్టాడు. తాగే నీటిని సిఫార్సు చేసే 'హైడ్రోహోమీ' అనే స్మార్ట్ వాటర్ బాటిల్‌ను కనిపెట్టాడు. ఈ ప్రాజెక్ట్ అతనికి విశ్వవిద్యాలయం నుండి 'ఉత్తమ ప్రాజెక్ట్ అవార్డు'ని తెచ్చిపెట్టింది.
* రైతుల కోసం స్మార్ట్ సాయిల్ టెస్టింగ్ డివైస్ ని కనిపెట్టాడు. ఇది మట్టిలో సూక్ష్మ పోషకాలను కొన్ని నిమిషాల్లోనే గుర్తిస్తుంది. ఈ ఘనతకు జూలై 2024 లో కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ చేతుల మీదుగా 'యంగ్ సైంటిస్ట్ అవార్డు' తీసుకున్నారు. ఇలా ప్రతి మైలు రాయిలోనూ తనతో పాటు ..ప్రజలు ఉపయోగపడేవి ఎన్నో చేయడం చాలా హర్షించదగిన విషయం.