దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3 గా నమోదైంది. భూకంప కేంద్రాన్ని ములుగులో భూమికి 40 కిలోమీటర్ల లోతున గుర్తించారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: తెలంగాణ లో భూకంపం వచ్చింది. ఈ రోజు ఉదయం ములుగు కేంద్రంగా కొన్ని సెకన్లపాటు భూమి కంపించింది, ఉదయం 7.27 గంటలకు కొన్ని సెకన్లపాటు భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3 గా నమోదైంది. భూకంప కేంద్రాన్ని ములుగులో భూమికి 40 కిలోమీటర్ల లోతున గుర్తించారు.
ఒక్క హైదరాబాద్ లోనే కాదు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్టణం, జగ్గయ్యపేట, నందిగామ, ఏలూరు సహా పలు ప్రాంతాల్లోనూ భూమి కంపించింది. ఈ భూకంపానికి మేడారం లో సమ్మక్క ..సారక్క గద్దెలు స్వల్పంగా కంపించాయి.
గద్దెల వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో భూకంపం నమోదైంది. భక్తులు పూజలు చేస్తుండగా ఒక్కసారిగా కంపించింది. అయితే, పూజల్లో నిమగ్నమైన భక్తులు అదేమీ పట్టించుకోలేదు. మరో గద్దె వద్ద ఏర్పాటు చేసి సీసీ కెమెరాలో అక్కడున్న పూజారి తీవ్రతను అనుభవించడం కనిపించింది. అయితే భూకంపం అని వారు అనుకోలేదు ..ఏం జరుగుతుందో అని అయోమయంగా చూస్తుండిపోయారు. ఏం జరిగిందో తెలియక ఆయన అయోమయంగా దిక్కులు చూస్తుండిపోయాడు.ఈ వీడియో ఇఫ్పుడు ఎక్కువగా వైరల్ అవుతుంది.