కౌంట్ డౌన్ ప్రక్రియ 25.30 గంటల పాటు జరిగిన తర్వాత ఉపగ్రహం ప్రయోగాన్ని వాయిదా వేశారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: పీఎస్ ఎల్ వీ -సీ 59 ప్రయోగం వాయిదా పడింది. ప్రోబా -3 ఉపగ్రహంలో సాంకేతిక సమస్య రావడంతో ఈ రాకెట్ ప్రయోగాన్ని రేపటికి అనగా డిసెంబర్ 5 ప్రయోగిస్తున్నట్లు తెలిపారు. వాస్తవానికి బుధవారం సాయంత్రం 4.08 గంటలకు ఈ ప్రయోగం జరగాలి కాని కౌంట్ డౌన్ ప్రక్రియ 25.30 గంటల పాటు జరిగిన తర్వాత ఉపగ్రహం ప్రయోగాన్ని వాయిదా వేశారు.
ఈ ప్రయోగాన్ని డిసెంబర్ 5 సాయంత్రం 4.12 గంటలకు రీ షెడ్యూల్ చేసినట్టు ఇస్రో ప్రకటించింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాలను పీఎస్ఎల్ వీ-సీ 59 కక్ష్యలోకి తీసుకెళ్లనుంది. ఈ రెండు శాటిలైట్లను ఇస్రో పోలార్ శాటిలైట్ ద్వారా ప్రయోగించనున్నారు. అయితే ఈ రెండు శాటిలైట్లు సమన్వయంతో ఒక క్రమపధ్ధతిలో సూర్యుని చుట్టూ భూకక్ష్యలో తిరగనున్నాయి.
శాస్త్రవేత్తలు కృత్రిమ సూర్యగ్రహణం కోసం పరిస్థితులను సిద్ధం చేసేందుకు ఈ ప్రయోగాన్ని చేపట్టారు.ఈ మిషన్లో భాగంగా ప్రయోగించిన రెండు ఉపగ్రహాల ద్వారా కృత్రిమ సూర్యగ్రహణాన్ని సృష్టించనున్నారు. తద్వారా శాస్త్రవేత్తలు సూర్యుని కరోనా పొరపై లోతైన అధ్యయనం చేయనున్నారు. ఈ అద్భుత ప్రయోగంలో ఇస్రో కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం.