కరోనా వైరస్‌పై రెండేళ్లపాటు సుదీర్ఘంగా జరిగిన దర్యాప్తు తర్వాత అమెరికా రిపబ్లికన్ నేతృత్వంలోని హౌస్ సెలక్షన్ కమిటీ ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: అమెరికా దాదాపు ఐదేళ్లు అవుతుంది. అయినా కోవిడ్ అంటే భయమే. వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎక్కడనుంచి వచ్చిందో ..చైనా లో పుట్టిందనే వార్తలున్నా ..అసలు నిజాలు ఇంకా తెలీదు..ఎప్పటికీ తెలీదు. అయితే అమెరికా ఈ సారి క్లారిటీ గా చెప్పేసింది . చైనా అవునన్నా ..కాదన్నా కరోనా వచ్చింది చైనా వూహాన్ ల్యాబ్స్ నుంచే. వూహాన్ ల్యాబ్స్ నుంచి కోవిడ్ లాంటి వైరస్ బయటకు వచ్చిందనే విషయాన్ని అమెరికా గట్టిగా చెబుతుంది.కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్ నుంచే లీక్ అయి ఉండొచ్చని పేర్కొంది. దాదాపు పది లక్షలమందికిపైగా అమెరికన్లను పొట్టనపెట్టుకున్న కరోనా వైరస్‌పై రెండేళ్లపాటు సుదీర్ఘంగా జరిగిన దర్యాప్తు తర్వాత అమెరికా రిపబ్లికన్ నేతృత్వంలోని హౌస్ సెలక్షన్ కమిటీ ఈ విషయాన్ని స్పష్టం చేసింది.