SV KRISHNA REDDY:ఇప్పుడు హీరోయిన్స్ కి బట్టలే ఉండడం లేదు..అందుకే సూపర్ హిట్స్

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇప్పుడు సినిమాలు చూస్తుంటే భయమేస్తుంది. ఏంటా కాస్ట్యూమ్స్ ..మనం సమాజానికి ఏం నేర్పిస్తున్నామన్నారు.


Published Sep 09, 2024 01:10:52 AM
postImages/2024-09-09/1725862171_sv1.jpg.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: మాయలోడు, ఘటోత్కచుడు , శుభలగ్నం అసలు ఇలాంటి సినిమాలు తీసిన వ్యక్తి ఇప్పుడు సైలెంట్ అయిపోయాడు. మ్యూజిక్ డైరక్టర్ , డైరక్షన్ లో ఎస్వీ కృష్ణారెడ్డి చాలా టాలెంటెడ్. ఫ్యామిలీ డ్రామా తియ్యడం సార్ ను కొట్టిన వారే లేరు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇప్పుడు సినిమాలు చూస్తుంటే భయమేస్తుంది. ఏంటా కాస్ట్యూమ్స్ ..మనం సమాజానికి ఏం నేర్పిస్తున్నామన్నారు.


ప్రస్తుతం ఫ్యామిలీతో వెళ్లి సినిమా చూస్తుంటే ఇబ్బంది పెట్టే సన్నివేశాలు ఉంటున్నాయి. నిజానికి ఇప్పటికి ..డైరెక్టర్ గా నా అప్రోచ్ కు చాలా తేడా ఉంది.  నా చిత్రాల్లో కొన్ని రూల్స్ ఫాలో అవుతాను. ఎక్కడా బూతులు తిట్టే డైలాగులు ఉండకూడదు అనేది మొదటిది. కామెడీ ఎప్పుడు వల్గర్ గా ఉండకూడదు. ఇక మూడోది ..ఇప్పటి తరం వాళ్లకి లేనిది హీరోయిన్ పైట జారకూడదు. చిన్న పైట జరిగినా కట్ చెప్పి చీర సరిచేసుకో అని చెప్పేవాడిని ..ఇప్పుడు హీరోయిన్స్ కు పైట ఉంటుందా..


ఇటీవల ప్రభాస్ సలార్ చిత్రం వచ్చింది. అది ఆడియన్స్ ని ఎంగేజ్ చేసే చిత్రం. అందులో వెయిట్ ఎంతైనా ఉండొచ్చు. కానీ సినిమా మొత్తం ఎంగేజ్ చేస్తూ మొమెంటం మైంటైన్ చేశారు. అందుకే సలార్ సక్సెస్ ఫుల్ చిత్రం అయింది అని అన్నారు. 


మిస్టర్ బచ్చన్ సినిమా లో విలన్ క్యారక్టర్ చాలా బాగుందని టాక్..కాని నాకు నచ్చలేదు. కారణాలు అడగొద్దు. సినిమా ఎప్పుడైనా 7 నిమిషాల్లో ఇంట్రస్టింగ్ గా ఉందా..లేదా అదే చెప్పేస్తుంది. హీరోయిన్లు బట్టలు తక్కువ వేసుకుంటే సినిమా సూపర్ హిట్ట్ ఇప్పుడు ఇదే ట్రెండ్ ఇక డీటైల్స్ అడగొద్దండి అంటూ చెప్పుకొచ్చారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu sv-krishna-reddy heroines- dressing-

Related Articles