Current Shock: ఫోన్ మాట్లాడుతూ కరెంట్ తీగను పట్టుకున్నబాలుడు !


Published Dec 28, 2024 12:36:00 PM
postImages/2024-12-28/1735369714_NewProject4.avif


న్యూస్ లైన్ , డెస్క్ :  నల్గొండ జిల్లాలో పదోతరగతి బాలుడు విద్యుత్ షాక్ కు గురై చనిపోయాడు. డాబాపైన నిలుచుకొని ఫోన్ మాట్లాడుతూ ..పొరపాటున విద్యుత్ తీగలను పట్టుకున్నాడు. దీంతో షాక్ తగిలి అక్కడిక్కడే ప్రాణాలు వదిలాడు. గుర్రంపొడు మండలం మక్కపల్లి గ్రామంలో శనివారం ఉదయం ఈ విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నేతళ్ల కిరణ్ స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు .

కొండమల్లేపల్లిలోని ప్రభుత్వ పాఠశాలకు రోజూ వెళ్లి వస్తాడు. శనివారం ఉదయం ఫోన్ రావడంతో డాబా పైకి వెళ్లి ఫోన్ మాట్లాడుతున్నాడు. ఏదో ఫోన్ మాట్లాడుతూ ఆదమరపున డాబా పక్కనే ఉన్న విద్యుత్ తీగలను పట్టుకున్నాడు. షాక్ తగలడంతో స్పాట్ లోనే చనిపోయాడు. అయితే కిరణ్ తల్లితండ్రుల పిర్యాధు మేరకు కేసు నమోదు చేసుకొని ..దర్యప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu 10th-class student currentofficers

Related Articles