iliyana:ఆ దర్శకుడు కోరిక తీర్చమని డైరెక్ట్ గా అడిగాడు.!

తెలుగు ఇండస్ట్రీలో  దాదాపు దశాబ్ద కాలం పాటు తన మానియా చూపించింది హీరోయిన్ ఇలియానా. ఈమె డేట్స్ కోసం అప్పట్లో దర్శక, నిర్మాతలు వెయిట్ చేస్తూ ఉండేవారు.  అలాంటి ఇలియానా తెలుగు


Published Aug 22, 2024 09:31:43 AM
postImages/2024-08-22/1724299303_ILIYANA.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు ఇండస్ట్రీలో  దాదాపు దశాబ్ద కాలం పాటు తన మానియా చూపించింది హీరోయిన్ ఇలియానా. ఈమె డేట్స్ కోసం అప్పట్లో దర్శక, నిర్మాతలు వెయిట్ చేస్తూ ఉండేవారు.  అలాంటి ఇలియానా తెలుగు తెరకు మొదటిసారి పరిచయమైంది  రామ్ హీరోగా వచ్చిన దేవదాస్ చిత్రంతోనే వచ్చిన మొదటి చిత్రమే అద్భుతమైన హిట్ సాధించడంతో ఆమెకు సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన రెండో సినిమా చేసే అవకాశం వచ్చింది. ఇక పోకిరి సినిమాలో మహేష్ తో జతకట్టడంతో ఈ చిత్రం కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది.

అలా రెండు చిత్రాలు అద్భుతమైన హిట్ సాధించడంతో ఇలియానా పేరు ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ తర్వాత వరుసగా ప్రభాస్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, వంటి హీరోల అందరితో నటించింది.  అలా యూత్ కు ఎంతో క్రేజీ హీరోయిన్ గా మారడంతో  దర్శక నిర్మాతలు ఈమె డేట్స్ కోసం వెయిట్ చేసేవారట.  అంతేకాకుండా ఈమె నడుము చాలా స్పెషల్ గా ఉండేది.  ఇలియానా నడుము పేరుతో పాటలు కూడా వచ్చాయి.  ప్రతి సినిమాలో ఇలియానా నడుము కనిపించే విధంగా దర్శకులు ప్లాన్ చేసుకునేవారు. ఇలా 10 సంవత్సరాల పాటు  ఒక ఊపు ఊపింది ఇలియానా. అలాంటి ఈ ముద్దుగుమ్మ అప్పట్లోనే కోటి రూపాయల పారితోషికం తీసుకొని  రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఇలియానా తర్వాత ఎప్పుడైతే కాజల్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిందో  అప్పటినుంచి ఈమెకు ఆఫర్లు తగ్గుతూ వచ్చాయి. దీంతో ఇలియానా బాలీవుడ్ బాట పట్టి అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నది.  అయితే అలాంటి ఇలియానా ఇండస్ట్రీలో ఎదిగే సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందట.

తనను కొంతమంది దర్శకులు టార్చర్ చేశారని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. తాను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో కొంతమంది నన్ను లైంగికంగా వేధించారని, ఒక డైరెక్టర్ అయితే డైరెక్ట్ గా నన్ను కోరిక తీర్చమని అడిగాడని చెప్పింది. ఆయన మాట విన్న ఇలియానా ఇంటికి వచ్చి సూసైడ్ కూడా చేసుకుందామనుకుందట. కానీ తన ఫ్యామిలీ గురించి ఆలోచించి మళ్లీ ఆగిపోయానని ఇలియానా వెల్లడించింది. ప్రస్తుతం ఆమె చెప్పిన మాటలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu kajal-agarwal iliyana maheshbabu devadas ram

Related Articles