మంగళవారం వచ్చిందంటే చాలు మన ఇండియాలో చాలామంది ఆంజనేయ స్వామిని నిష్టగా పూజిస్తారు. ఉపవాస దీక్షలో ఉండి పూజిస్తే మనం కోరిన కోరికలు నెరవేరడమే కాకుండా ధైర్య, బల, సాహసాలు కూడా సిద్ధిస్తాయని నమ్ముతారు. మరి అలాంటి ఆంజనేయస్వామిని మనం కోరిన కోరికలు నెరవేరాలంటే ఏ విధమైనటువంటి పూజలు చేయాలి అనే వివరాలు చూద్దాం.. ఈ మంగళవారం రోజున చాలామంది భక్తులు ఆలయాలకు వెళ్లి ఆంజనేయ స్వామికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. మరికొందరు ఇంట్లోనే ఉండి పూజలు చేస్తారు.
న్యూస్ లైన్ డెస్క్: మంగళవారం వచ్చిందంటే చాలు మన ఇండియాలో చాలామంది ఆంజనేయ స్వామిని నిష్టగా పూజిస్తారు. ఉపవాస దీక్షలో ఉండి పూజిస్తే మనం కోరిన కోరికలు నెరవేరడమే కాకుండా ధైర్య, బల, సాహసాలు కూడా సిద్ధిస్తాయని నమ్ముతారు. మరి అలాంటి ఆంజనేయస్వామిని మనం కోరిన కోరికలు నెరవేరాలంటే ఏ విధమైనటువంటి పూజలు చేయాలి అనే వివరాలు చూద్దాం..
ఈ మంగళవారం రోజున చాలామంది భక్తులు ఆలయాలకు వెళ్లి ఆంజనేయ స్వామికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. మరికొందరు ఇంట్లోనే ఉండి పూజలు చేస్తారు. మంగళవారం రోజున ఉదయాన్నే తలంటు స్నానం చేసి ఎరుపు రంగు దుస్తులు ధరించి, హనుమంతుని పూజ చేయాలి. అంతేకాకుండా సింధూరం, ఎరుపు రంగు పుష్పాలతో ఆంజనేయ స్వామిని పూజించాలి.
ఇలా చేయడం వల్ల గ్రహదోషాలు ఉంటే మాత్రం ఈజీగా వెళ్ళిపోతాయి. అంతేకాకుండా హనుమంతునికి ఇష్టమైనటువంటి తమలపాకులతో కూడా పూజ చేస్తే కష్టాలు తొలగిపోతాయి. ఆరోగ్య సమస్యలు దీర్ఘకాలిక సమస్యలు మటుమాయమవుతాయి.
అంతేకాకుండా హనుమాన్ చాలీసా చదివితే మీ మనసులో బాధ ఉన్న తొలిగిపోయి ధైర్యం కూడా కలుగుతుంది. అంతేకాకుండా మంగళవారం హనుమంతున్ని నిష్టగా పూజించి ఆయనకిష్టమైనటువంటి ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పింస్తే మీరు ఏ కోరిక కోరుకున్న తప్పకుండా నెరవేరుతుందని పండితులు అంటున్నారు.