రౌడీ హీరో విజయ్ దేవరకొండ అంటే పాన్ ఇండియా లెవెల్ లో తెలియని వారు ఉండరు. ఈయన అర్జున్ రెడ్డి, గీతాగోవిందం సినిమాల ద్వారా ఎంతో గుర్తింపు పొందారు.కానీ ఈ మధ్య కాలంలో ఈయన కాస్త డల్ అయిపోయారు
న్యూస్ లైన్ డెస్క్: రౌడీ హీరో విజయ్ దేవరకొండ అంటే పాన్ ఇండియా లెవెల్ లో తెలియని వారు ఉండరు. ఈయన అర్జున్ రెడ్డి, గీతాగోవిందం సినిమాల ద్వారా ఎంతో గుర్తింపు పొందారు.కానీ ఈ మధ్య కాలంలో ఈయన కాస్త డల్ అయిపోయారు. ఆ తర్వాత ఖుషి,ఫ్యామిలీ స్టార్ సినిమాలతో కాస్త పుంజుకున్నారు. అలాంటి విజయ్ దేవరకొండ తో గీతాగోవిందం చిత్రంలో నటించింది రష్మిక మందన్నా.
దీంతో వీరి మధ్య అప్పుడే కాస్త లవ్ స్టోరీ పెరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్నటువంటి రష్మిక మందన్నా,విజయ్ దేవరకొండ ను పెళ్లి కూడా చేసుకోబోతుందని ఈ మధ్యకాలంలో వార్తలు వినిపిస్తున్నాయి. ఒకానొక సమయంలో వీరు స్పందించి మా మధ్య స్నేహమే ఉందని చెప్పుకుంటూ వచ్చారు.. కానీ వీరి మధ్య లవ్ విపరీతంగా ఉందని తెలియజేసే కొన్ని వీడియోలు, ఫొటోస్ బయటకు వచ్చాయి.
అయితే గీతా గోవిందం మూవీలోని "తెల్లా తెల్లావారే వెలుగు రేఖలా" సాంగ్ రష్మిక కు చాలా ఇష్టమంట. అయితే ఈ సాంగ్ గురించి ఒక తెలుగు ఇండియన్ ఐడల్ సింగింగ్ ప్రోగ్రాంలో హోస్ట్ శ్రీరామచంద్ర అడగగా.. నాకు ఈ సాంగ్ అంటే చాలా ఇష్టమని, ఈ సాంగులో నేను నటించిన విధానం చాలా నచ్చుతుందని చెప్పుకొచ్చింది. మరి మీకు మీ యొక్క కోస్టార్ మీద ఏమైనా ప్రేమ, క్రష్ కలిగిందా అని శ్రీ రామచంద్ర ప్రశ్నించారు.
దీనికి రష్మిక మందన్నా కూడా ఎస్ అంటూ సమాధానం ఇచ్చింది. దీంతో అక్కడున్న వారంతా నవ్వారు. ఈ సమయంలోనే విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్నా మధ్య లవ్ నడుస్తుందని చాలామంది ఫిక్స్ అయిపోయారు. ఈయనతో ఇప్పటికే ఆమె రెండు సినిమాల్లో నటించింది. ఈ రెండు చిత్రాల్లో గీత గోవిందం బ్లాక్ బస్టర్ అయితే డియర్ కామ్రేడ్ ఓకే టాక్ తెచ్చుకుంది.