Bigboss8: మూడో వారం ఎలిమినేట్.. ఎవరంటే.?

బిగ్ బాస్ మూడో సీజన్  చాలా ఆసక్తికరంగా సాగుతోంది. ఈ సీజన్ చాలా స్పెషల్ గా ఉంటుందని నాగార్జున మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చారు. ఆ విధంగానే ఈ సీజన్ చాలా స్పెషల్ గా సాగుతూ


Published Sep 22, 2024 12:26:50 PM
postImages/2024-09-22/1726988210_ABHAI.jpg

న్యూస్ లైన్ డెస్క్: బిగ్ బాస్ మూడో సీజన్  చాలా ఆసక్తికరంగా సాగుతోంది. ఈ సీజన్ చాలా స్పెషల్ గా ఉంటుందని నాగార్జున మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చారు. ఆ విధంగానే ఈ సీజన్ చాలా స్పెషల్ గా సాగుతూ వస్తోంది. అలాంటి బిగ్ బాస్ మొదలైనప్పటి నుంచి మొదటివారం బెబక్క రెండో వారం శేఖర్ భాషా ఎలిమినేట్ అయ్యారు.  మూడో వారం  ఎవరు ఎలిమినేట్ అవుతారనేది చాలా ఆసక్తికరంగా మారింది.  అయితే శనివారం రోజు హౌస్ లో అడుగుపెట్టినటువంటి నాగార్జున ప్రతి కంటెస్టెంట్ ను కడిగిపారేశాడు.  వారి ఆట తీరు, వారు చేసిన తప్పులను బయటపెట్టారు. అంతేకాకుండా ప్రేరణ, విష్ణు ప్రియకు క్లాస్ పీకారు.

 అనవసరంగా అమ్మాయిలను ఇబ్బంది పెడుతున్నటువంటి మణికంఠకు కూడా గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు.  చివరికి అభయ్ నవీన్ కు రెడ్ కార్డు చూపించి గెటవుట్ అన్నాడు. కానీ అందులో ఉండే మిగతా కంటెస్టెంట్లు కాస్త రిక్వెస్ట్ చేయడంతో హౌస్ లోనే ఉండమని చెప్పారు. కట్ చేస్తే మూడో వారం ఎలిమినేషన్ ఈరోజుతో ముగుస్తుంది. ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది.  ఈ వారం  డేంజర్ జోన్ లో ఉన్నది మాత్రం అభయ్ పృథ్వీరాజ్  అని తెలుస్తోంది. ఎగ్స్ టీంలో అభయ్ వర్సెస్ నిఖిల్ టీం పోటీ పడాల్సి ఉంది. కానీ ఇందులో అభయ్  పూర్తిగా చేతులెత్తేసి  మిగతా టీం సభ్యులు కష్టపడి ఎగ్స్ తెస్తే ఆయన జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాడు.

టీం చీప్ గా ఉన్నటువంటి ఆయన గేమ్ అంతా ముందుకు నడిపించాలి కానీ, అది మర్చిపోయి రిలాక్స్ అయ్యాడు.  అంతేకాకుండా బిగ్బాస్ ని కూడా తిడుతూ ఆనందం పొందాడు. దీంతో నాగర్జున ఆయనకు రెడ్ కార్డు చూపించారు. ఏది ఏమైనా ఈరోజు మాత్రం బిగ్ బాస్ హౌస్ నుంచి నామినేషన్ లో ఉన్న ఎవరో ఒక్కరు మాత్రం బయటకు వెళ్లాల్సిందే. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అభయ్ నవీన్, పృథ్వీరాజ్  ఉన్నారని తెలుస్తోంది. ఇందులో ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనేది మీరే చెప్పండి.

newsline-whatsapp-channel
Tags : news-line nagarjuna prudhvi-raj nikhil bigboss8 nainika abhai

Related Articles