ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ గా ఎదిగింది ఈ హీరోయిన్. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్, భాషల్లో కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ప్రముఖ డైరెక్టర్ ను పెళ్లి
న్యూస్ లైన్ డెస్క్: ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ గా ఎదిగింది ఈ హీరోయిన్. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్, భాషల్లో కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ప్రముఖ డైరెక్టర్ ను పెళ్లి చేసుకొని కోలీవుడ్ ఇండస్ట్రీలో సెట్ అయిపోయింది. ఇంతకీ ఆవిడ ఎవరయ్యా అంటే అందమైన తార నయనతార.
ఈ మధ్యకాలంలో సోలో లీడ్ పాత్రలు చేస్తూ లేడీ ఓరియంటెడ్ చిత్రాలు నటిస్తూ వస్తోంది. అయితే పెళ్లి జరిగిన తర్వాత నయనతార వరుస చిత్రాల్లో దూసుకుపోతూ వస్తోంది. అయితే నయనతార సినిమా బడ్జెట్ ను బట్టి 10 నుంచి 15 కోట్ల రూపాయల పారితోషకం తీసుకుంటుందట.
అలాంటి నయనతార తాజాగా ఒక ప్రముఖ యాడుకు 10 సెకండ్లకు కోటి రూపాయలు చొప్పున, 50 సెకండ్లకు ఐదు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుందట. తెలుగు సినిమా ఇండస్ట్రీలో 10 సెకండ్లకు కోటి రూపాయలు తీసుకున్న హీరోయిన్ గా రికార్డు క్రియేట్ చేసింది. అయితే ఈ యాడ్ టాటా స్కైకి చెందినటువంటి యాడ్.
ప్రస్తుతం నయనతార హైయెస్ట్ రెమ్యునరేషన్ అందుకున్న హీరోయిన్ గా రికార్డులు క్రియేట్ చేసింది. అయితే తాజాగా నయనతార బాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ అట్లీ కుమార్ అలాగే బాలీవుడ్ బాద్షా షారుఖ్ఖాన్ కాంబినేషన్ లో వచ్చినటువంటి జవాన్ చిత్రంలో కథానాయికగా చేసి మెప్పించింది.