ఛీ..ఛీ..చైతుపై కోపంతో  సమంత డైరెక్టర్ తో అలాంటి పని చేస్తుందా.?

సినిమా ఫీల్డ్ లో చాలామంది నటి నటులు ప్రేమ, అనురాగం పెళ్లి అనే బంధానికి విలువనివ్వరు. అంటే ఇలా అందరూ నటులు ఉంటారని కాదు  ప్రస్తుత కాలంలో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే చాలా


Published Aug 14, 2024 12:23:17 PM
postImages/2024-08-14/1723618397_samantha12.jpg

న్యూస్ లైన్ డెస్క్: సినిమా ఫీల్డ్ లో చాలామంది నటి నటులు ప్రేమ, అనురాగం పెళ్లి అనే బంధానికి విలువనివ్వరు. అంటే ఇలా అందరూ నటులు ఉంటారని కాదు  ప్రస్తుత కాలంలో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే చాలా మంది నటులు  ఈ విధంగానే తయారయ్యారు. అంతే కాదు ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లు చేసుకొని పిల్లలు పుట్టాక కూడా  ఇండస్ట్రీకి చెందిన భార్యాభర్తలు విడిపోతున్నారు. చెరోదారి చూసుకొని మళ్లీ పెళ్లిళ్లు చేసుకొని పిల్లలని కంటున్నారు. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాగచైతన్య సమంత పెళ్లి చేసుకుని  వారి వివాహ బంధానికి స్వస్తి చెప్పారు.

ఆ తర్వాత ఇద్దరూ  వారి కెరియర్ పై దృష్టి పెట్టి కొన్ని సంవత్సరాల నుంచి అలాగే కొనసాగుతూ వస్తున్నారు. ఇదే తరుణంలో సమంత మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడి ఇబ్బందులు పడింది. దాని నుంచి మెల్లిగా కోలుకొని సినిమాలో నటిస్తోంది. నాగచైతన్య కూడా సినిమాలో నటిస్తూ దూసుకుపోతున్న తరుణంలోనే శోభిత ధూళిపాళ్లతో పరిచయం ఏర్పడింది. ఇది కాస్త ప్రేమకు దారి తీయడంతో ఈ మధ్యకాలంలోనే ఎంగేజ్మెంట్ ద్వారా  వారి ప్రేమ విషయాన్ని బయటపెట్టేసారు. త్వరలో వీళ్లు పెళ్లి కూడా చేసుకోబోతున్నారట. ఈ విధంగా వీరి వ్యవహారం నడుస్తున్న తరుణంలో  సమంత ఒక దర్శకుడితో చాలా చనువుగా ఉంటుందని  దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే సమంత ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ రాజుతో డేటింగ్ చేస్తోందని , వీరిద్దరూ కలిసి పలు లొకేషన్స్  కు కూడా వెళ్లారని తెలుస్తోంది. అంతే కాదు ఇద్దరు క్లోజ్ గా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కానీ ఈ విషయంపై సమంతకాని, దర్శకుడు రాజు కానీ ఇప్పటివరకు స్పందించలేదు. దీన్ని బట్టి చూస్తే మాత్రం వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని చాలామంది అనుకుంటున్నారు. ప్రస్తుతం సమంత  నాగచైతన్యపై కోపంతో ఈ విధంగా దర్శకుడితో అలా చేస్తోందా అంటూ కూడా కామెంట్లు పెడుతున్నారు.

newsline-whatsapp-channel
Tags : news-line samantha nagachaitanya love-story director-raju family-man

Related Articles