మోక్షజ్ఞ చిత్రంలో  బాలయ్యతో పాటు ఆ ఇద్దరు హీరోలు కూడా చేస్తారా.?

మోక్షజ్ఞ  నందమూరి మూడవ తరం హీరోగా ఎంట్రీ ఇస్తున్నటువంటి  హీరో. ఇప్పటికే అన్న ఎన్టీఆర్ నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని బాలకృష్ణ, హరికృష్ణ,, కళ్యాణ్ రామ్,  తారక రత్న, జూనియర్ ఎన్టీఆర్


Published Sep 07, 2024 01:05:45 PM
postImages/2024-09-07/1725694545_mokshagna.jpg

న్యూస్ లైన్ డెస్క్: మోక్షజ్ఞ  నందమూరి మూడవ తరం హీరోగా ఎంట్రీ ఇస్తున్నటువంటి  హీరో. ఇప్పటికే అన్న ఎన్టీఆర్ నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని బాలకృష్ణ, హరికృష్ణ,, కళ్యాణ్ రామ్,  తారక రత్న, జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో కొనసాగారు.  ఇందులో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ స్టార్లుగా ఎదిగారు.  హరికృష్ణ కూడా స్టార్ అయ్యారు కానీ ఆయన ప్రమాదవశాత్తు మరణించడంతో  ఆయన శకం ముగిసిపోయింది. అలాంటి ఈ తరుణంలో  ఈ మూడవ తరం హీరోలలో బాలకృష్ణ ముద్దుల కొడుకు మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తారని, గత కొన్ని నెలల నుంచి వార్తలు వస్తున్నాయి.

ఈ వార్తలను నిజం చేస్తూ తాజాగా మోక్షజ్ఞ బర్త్ డే సందర్భంగా  ఆయన సినిమాకు సంబంధించిన ఫస్ట్ పోస్టర్ రిలీజ్ అయింది. అయితే ఈయన హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని తన తమ్ముడి మూవీకి  నిర్మాతగా పనిచేస్తుందట.  ఇక ఈ సినిమాలో మోక్షజ్ఞ సరసన హీరోయిన్ ఎవరు అనేది మాత్రం తెలియదు. ఈ చిత్రంలో గెస్ట్ అఫ్ఫిరియన్స్ గా  తన తండ్రి బాలకృష్ణ రాబోతున్నారని అనేక వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేకాకుండా తమ్ముడి కోసం ఆ స్టార్ హీరోలు కూడా ఇందులో నటిస్తారని తెలుస్తోంది. ఇంతకీ వారు ఎవరయ్యా అంటే అన్న ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, మోక్షజ్ఞకు బూస్టర్ ఇచ్చేందుకు స్పెషల్ అఫ్ఫిరియన్స్ లో కనిపించబోతున్నారట. పాన్ ఇండియా లెవెల్ లో రాబోతున్న ఈ చిత్రం సోషియో ఫాంటసీ కథాంశంతో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా  జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ ఈ చిత్రంలో నటిస్తే మాత్రం మోక్షజ్ఞ మొదటి మూవీ బంపర్ హిట్ అయ్యే అవకాశం ఉంటుంది.  మరి చూడాలి వీళ్ళు నటిస్తారా లేదంటే సైలెంట్ గా ఉంటారా అనేది ముందు ముందు తెలుస్తుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu jr-ntr balakrishna mokshagna kalyan-ram harikrishna

Related Articles