tollywood: నేనేం మంచిదాన్ని కాదు ...నేను నైట్ అయితే ఫుల్ తాగుతా !

తనకు ఫుల్ గా తాగే అలవాటు ఉందంట. అంతేకాదు తను చదువుకుంటున్న రోజుల నుంచి ఈ డ్రింకింగ్ అలవాటు ఉందని తెలిపింది.


Published Sep 30, 2025 11:28:00 AM
postImages/2025-09-30/1759212101_sddefault.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : టెలివిజన్ ఆడియన్స్ కు సౌమ్యరావు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కాస్త వచ్చిరాని తెలుగులో మంచి కామిక్ సెన్స్ తో జబర్ధస్త్ తో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఈ షో లో బ్యూటీ విత్ కామెడీ ..స్టైల్ విత్ గ్లామర్ తో అదరగొట్టింది. ఎక్కువ కాలం పనిచేయకపోయినా గుర్తుండిపోయే యాంకర్‌గా మారింది. అయితే ఈ అమ్మడు తన గురించి షాకింగ్ కామెంట్లు చేసింది. తను పతివ్రతను కాదంటూ షాకింగ్ నిజాలు చెప్పింది. తనకు ఫుల్ గా తాగే అలవాటు ఉందంట. అంతేకాదు తను చదువుకుంటున్న రోజుల నుంచి ఈ డ్రింకింగ్ అలవాటు ఉందని తెలిపింది.


స్టార్టింగ్ లో తమిళ సీరియల్ "రోజా" సీరియల్‌తో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తరువాత నెంజమ్ మరప్పదిల్లై, వల్లి, మిన్నలే, తిరుమతి హిట్లర్ వంటి సీరియల్స్‌లో నటించి పేరు తెచ్చుకుంది. తెలుగు టెలివిజన్ రంగంలోకి కూడా అడుగు పెట్టి "శ్రీమంతుడు" సీరియల్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుంది. తనకు తెలుగు బాష పెద్దగా రాదు. అయితే ఇక్కడ కామెడీ వర్కవుట్ అయ్యింది. హైపర్ ఆదితో కరెక్ట్ పంచులు సెట్ అవుతాయి. 


ఓ ఇంటర్వ్యూ లో తన పర్సనల్ విషయాలు చాలా చెప్పింది. ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్తే వైన్ కంపల్సరీ తాగుతామని చెప్పింది. తాగడం విషయంలో నాకు అసలు అబధ్ధం చెప్పడం ఇష్టం లేదు. జస్ట్ ఫ్రెష్ ఫీలింగ్ కోసం ఓ లిమిట్ లో ఎంజాయ్ చేస్తే బాగుంటుంది. డ్రింక్ చేసిన తర్వాత మైండ్ లోకి ఏం వస్తుంది. ఇండస్ట్రీ నే గుర్తొస్తుంది ఆ డైరక్టర్ అలా తిట్టాడు. ఇలా అన్నాడనే విషయాలు గుర్తొస్తాయి..ఇంకా చెప్పాలంటే అవమానాలు గుర్తొస్తాయంూ చెప్పింది. ఇందుకే నా ఫ్రెండ్స్ నాతో పార్టీకి రావడం తగ్గిస్తారు" అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇప్పుడు ఈ కామెంట్లు ఫుల్ వైరల్ అవుతున్నాయి.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu anchor drink actor-soumya

Related Articles