నేను మొరగను.. కరుస్తాను’.. దర్శకుడికి నటి వరలక్ష్మి కౌంటర్..!

‘మొరిగే కుక్క కరవదు.. కానీ నేను కరుస్తా’ అంటూ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ సినీ పరిశ్రమలో తీవ్ర దుమారం రేపుతోంది. 'పోలీస్ కంప్లైంట్' సినిమా ప్రమోషన్లకు ఆమె హాజరుకాకపోవడంపై ఆ చిత్ర దర్శకుడు సంజీవ్ మేగోటి చేసిన విమర్శలకు కౌంటర్‌గా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 


Published Jun 11, 2026 02:20:32 PM
postImages/2026-06-11/1781167832_varalakshmi0.jpg.webp

‘మొరిగే కుక్క కరవదు.. కానీ నేను కరుస్తా’ అంటూ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ సినీ పరిశ్రమలో తీవ్ర దుమారం రేపుతోంది. 'పోలీస్ కంప్లైంట్' సినిమా ప్రమోషన్లకు ఆమె హాజరుకాకపోవడంపై ఆ చిత్ర దర్శకుడు సంజీవ్ మేగోటి చేసిన విమర్శలకు కౌంటర్‌గా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.'పోలీస్ కంప్లైంట్' సినిమాలో వరలక్ష్మి ప్రధాన పాత్ర పోషించారు. అయితే, సినిమా విడుదలకు సిద్ధమవుతున్నా ఆమె ప్రమోషన్లకు రావడం లేదని ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు సంజీవ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.'పెద్ది' సినిమా కోసం రామ్ చరణ్, 94 ఏళ్ల వయసులో సింగీతం శ్రీనివాసరావు తమ చిత్రాలను ప్రమోట్ చేసుకుంటుంటే, వరలక్ష్మి మాత్రం రాకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. షూటింగ్ పూర్తి చేసి, రెమ్యునరేషన్ తీసుకున్నప్పటికీ ప్రమోషన్లను విస్మరించారని ఆరోపించారు. దర్శకుడి వ్యాఖ్యలు వైరల్ కావడంతో వరలక్ష్మి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పరోక్షంగా గట్టి కౌంటర్ ఇచ్చారు."మొరిగే కుక్క కరవదు.. కానీ నేను కరుస్తాను. నా మౌనాన్ని చేతకానితనంగా అనుకోవద్దు" అంటూ ఒక కొటేషన్‌ను షేర్ చేశారు. ఎవరి పేరును నేరుగా ప్రస్తావించకపోయినా, తనపై ఆరోపణలు చేసిన దర్శకుడు సంజీవ్‌ను ఉద్దేశించే ఆమె ఈ పోస్ట్ పెట్టారని స్పష్టమవుతోంది. అంతే కాకుండా ఈ సినిమాలో మరో కీలక పాత్ర పోషించిన హీరో నవీన్ చంద్ర కూడా ప్రమోషన్లలో పెద్దగా కనిపించడం లేదు. జూన్ 12న సినిమా థియేటర్లలో విడుదలవుతున్న నేపథ్యంలో, లీడ్ యాక్టర్స్ ప్రమోషన్లకు దూరంగా ఉండటం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

newsline-whatsapp-channel
Tags : tollywood entertainment movie-news varalaxmi-sharath-kumar sanjeev-megoti

Related Articles