బాలయ్య బర్త్‌డే స్పెషల్.. NBK111 గ్లింప్స్ రిలీజ్

నటుడు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు (జూన్ 10, 2026) పురస్కరించుకుని ఆయన 111వ చిత్రం 'NBK 111' ఫస్ట్ లుక్‌తో పాటు పవర్‌ఫుల్ గ్లింప్స్‌ను చిత్రబృందం అధికారికంగా విడుదల చేసింది. "ఎంట్రీ ఆఫ్ యాన్ ఎరా" పేరుతో విడుదలైన ఈ 1 నిమిషం 31 సెకన్ల గ్లింప్స్ వీడియో అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోంది.


Published Jun 10, 2026 06:45:19 PM
postImages/2026-06-10/1781097319_nbk.jpg.webp

నటుడు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు (జూన్ 10, 2026) పురస్కరించుకుని ఆయన 111వ చిత్రం 'NBK 111' ఫస్ట్ లుక్‌తో పాటు పవర్‌ఫుల్ గ్లింప్స్‌ను చిత్రబృందం అధికారికంగా విడుదల చేసింది. "ఎంట్రీ ఆఫ్ యాన్ ఎరా" పేరుతో విడుదలైన ఈ 1 నిమిషం 31 సెకన్ల గ్లింప్స్ వీడియో అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోంది. "నో మోర్ వింటేజ్.. ఓన్లీ న్యూ ఏజ్" అనే ట్యాగ్‌లైన్‌కు తగ్గట్టుగా బాలకృష్ణ ముంబై బ్యాక్‌డ్రాప్‌లో ఎవరూ ఊహించని సరికొత్త స్టైలిష్ అండ్ మాస్ లుక్‌లో కనిపించారు. 'వీరసింహారెడ్డి' వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేని, బాలయ్య కలయికలో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. ఈ చిత్రంలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, యంగ్ హీరో మంచు మనోజ్ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. శరత్ కుమార్, సముద్రఖని, అభిమన్యు సింగ్ కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ చిత్రానికి ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని  నిర్మిస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : balakrishna entertainment kajal-agarwal movie-news manchu-manoj gopichand-malineni glimpse-video

Related Articles