మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వచ్చిన పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. జూన్ 4న విడుదలైన ఈ చిత్రం కేవలం ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 332.1 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వచ్చిన పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. జూన్ 4న విడుదలైన ఈ చిత్రం కేవలం ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 332.1 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థలైన వృద్ధి సినిమాస్ మరియు మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించాయి. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ వాల్యూ సుమారు రూ. 160 కోట్లు (షేర్) కాగా, కేవలం ఆరు రోజుల్లోనే రూ. 175 కోట్లకు పైగా వరల్డ్‌వైడ్ షేర్ సాధించి అధికారికంగా ప్రాఫిట్ జోన్‌లోకి ప్రవేశించింది. రామ్ చరణ్ సోలో హీరోగా నటించిన సినిమాల్లో అత్యంత వేగంగా రూ. 300 కోట్ల మార్కును దాటిన చిత్రంగా 'పెద్ది' సరికొత్త మైలురాయిని అందుకుంది. అలాగే నార్త్ అమెరికాతో పాటు ఇతర విదేశీ మార్కెట్లలోనూ ఈ చిత్రం భారీగా వసూళ్లను రాబడుతోంది. ఇప్పటివరకు ఓవర్సీస్ గ్రాస్ దాదాపు రూ. 48 కోట్లకు పైగా చేరింది.జాన్వీ కపూర్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే కుస్తీ పోటీల కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం, వీక్ డేస్‌లో కూడా తెలుగు రాష్ట్రాల్లో స్టెడీ కలెక్షన్లతో దూసుకుపోతోంది.