AKSHAY KUMAR : నా కూతుర్నే న్యూడ్ పిక్స్ పంపమని అడిగారు !

రీసెంట్ గా " సైబర్ అవేర్ నెస్ మంత్ 2025 " ఓపెనింగ్ సెరమనీ లో తన ఫ్యామిలీ కి జరిగిన ఇన్సిడెంట్ ను షేర్ చేసుకున్నారు.                                                                                                                                                                                                                                                


Published Oct 04, 2025 12:52:00 PM
postImages/2025-10-04/1759562629_akshaykumarrevealedhisdaughtersencounterwithanonlinepredator.avif

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : సోషల్ మీడియా ఎఫెక్ట్ టీనేజర్స్ పై చాలా ఎక్కువగా ఉంది. తెలిసీ తెలియని వయసులోనే పిల్లలు తప్పుదోవ పడుతున్నారు. ఆన్ లైన్ గేమ్స్ ..బెట్టింగ్స్ తో పిల్లలు చెడిపోతున్నారు. పేరెంట్స్ ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటూ తెలిపారు అక్షయ్ కుమార్. ప్రతి స్కూల్ లోను సైబర్ క్రైమ్ కోసం పిల్లలకు అవేర్ నెస్ కలిగించాలని అన్నారు అక్షయ్. సైబర్ నేరగాళ్లు చిన్నారులను ఎలా లక్ష్యంగా చేసుకుంటున్నారో వివరిస్తూ అందరినీ హెచ్చరించారు.  రీసెంట్ గా " సైబర్ అవేర్ నెస్ మంత్ 2025 " ఓపెనింగ్ సెరమనీ లో తన ఫ్యామిలీ కి జరిగిన ఇన్సిడెంట్ ను షేర్ చేసుకున్నారు.                                                                                                                                                                                                                                                       
కొన్ని నెలల క్రితం తన కుమార్తె నితార ఇంట్లో ఆన్‌లైన్ వీడియో గేమ్ ఆడుతుండగా ఈ సంఘటన జరిగిందని అక్షయ్ కుమార్ తెలిపారు. గేమ్ లో అసలు పరిచయం లేని ఓ వ్యక్తితో ఆడుతున్నపుడు ఫస్ట్ చాలా మంచిగా మెసెజ్ లు పెట్టాడట.." గేమ్ చాలా బాగా ఆడుతున్నారని తర్వాత నుంచి "నువ్వు ఎక్కడి నుంచి?" అని అడగ్గా, తన కుమార్తె 'ముంబై' అని సమాధానమిచ్చిందని అక్షయ్ చెప్పారు. ఆ తర్వాత నుంచి నువ్వు అమ్మాయా ...అబ్బాయా ..అమ్మాయని అనగానే ...నీ న్యూడ్ పిక్స్ పంపు అంటూ మెసేజ్ చెయ్యడం స్టార్ట్ చేశాడు.మెసేజ్ చూడగానే నా కూతురు వెంటనే గేమ్ ఆఫ్ చేసి, జరిగిందంతా నా భార్యకు చెప్పింది. 


ఇప్పుడు ఈ సమస్య నా కూతురుది మాత్రమే  కాదు...ఇలాంటి సైబర్ నేరాలు ప్రతి ఆడపిల్లది. కొంతమంది పిల్లలకు తెలియక వారి చేతిలో బ్లాక్ మెయిలింగ్ కు గురవుతున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ల తప్పు లేకపోయినా ..వాళ్లు సఫర్ అవుతున్నవారు చాలా మంది ఉన్నారు. ఈ డిజిటల్ వరల్డ్ లో పిల్లలకు సైబర్ నేరాలపై ఓ అవగాహన కల్పించాలి. రాష్ట్రంలోని పాఠశాలల్లో 7 నుంచి 10వ తరగతి వరకు ప్రతి వారం సైబర్‌క్రైమ్‌పై ఒక పీరియడ్ కేటాయించాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఆయన ఓ సజిషన్ ఇచ్చారు అక్షయ్ కుమార్.
 

newsline-whatsapp-channel
Tags : crime online akshay-kumar cyber-security

Related Articles