saipallavi: అలియా కు నో చెప్పి సాయిపల్లవికి ఓకే అయిన బాలీవుడ్ ప్రాజెక్ట్ !

ఈ బాలీవుడ్ మేళం మన సౌత్ లో సాయిపల్లవి ఉన్నారుగా అంటూ ఆ మూవీ సాయిపల్లవిని ఫైనల్ చేశారు.


Published Oct 04, 2025 11:41:00 AM
postImages/2025-10-04/1759558472_AA1NLyYo.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : బాలీవుడ్ లో మెల్లగా కోల్డ్ వార్ మొదలైంది. హీరోయిన్లను షఫిల్ చేస్తున్నారు. ఏ హీరోయిన్ అయితే ప్రాజెక్ట్ కు పాజిటివ్ గా ఉంటుందో వారినే తీసుకోవడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు ప్రొడ్యూసర్లు. ఇప్పుడు ఆల్ మోస్ట్ అలియా భట్ కు ఓకే అయిన ప్రాజెక్ట్స్ ను మూవీ టీం కాన్సిల్ చేసి సాయిపల్లవికి ఓకే చేశారు. ఇప్పుడు ఈ టాపిక్ ఇండస్ట్రీలో చిన్నగా చిట్ చాట్స్ ను స్టార్ట్ చేస్తుంది. కల్కి2898AD తో పాన్ వరల్డ్ లో సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన  నాగ్ అశ్విన్ ..ప్రస్తుతం ప్రభాస్ కలిసి పార్క్ 2 పనుల్లో ఫుల్ బిజీ ఉన్నారు. అయితే చిన్న చిన్న గా వచ్చే గ్యాప్స్ లో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఫస్ట్ అలియా ను ఫిక్స్ అయ్యారు. మరి దీపిక లా కోరికలు కోరిందో లేక బేరం తెగలేదో కాని చివరాకరికి ఎందుకు ఈ బాలీవుడ్ మేళం మన సౌత్ లో సాయిపల్లవి ఉన్నారుగా అంటూ ఆ మూవీ సాయిపల్లవిని ఫైనల్ చేశారు.


అలియా ప్రజెంట్ బాలీవుడ్‌లో మడ్డాక్ ఫిల్మ్స్  ప్రొడక్షన్ లో ఓ హారర్ ఫ్రాంచైజ్ 'చాముండ'పై పూర్తి ఫోకస్ పెట్టింది. 2026 మార్చి నుంచి ఈ ప్రాజెక్ట్ షూట్ స్టార్ చేయనున్నారు. దీంతో భారీగా డేట్స్ అడ్జెస్ట్ చెయ్యాల్సి వచ్చిందట. ఈ టైంలో నాగ్ అశ్విన్ అలియా కోసం వెయిట్ చేసే పరిస్థితిలో లేడు. సో అలియా ను లైట్ తీసుకొని సాయికి టికెట్ కన్ఫర్మ్ చేశాడట నాగ్ అశ్విన్. అయితే అటు సాయి పల్లవి కాని నాగ్ అశ్విన్ టీం కాని అనౌన్స్ చెయ్యలేదు. కాని ఇండస్ట్రీ లో బాగా పేరు వినిపిస్తుంది. ప్రస్తుతం ఆమె రణ్‌బీర్ కపూర్‌తో కలిసి రూపొందుతున్న 'రామాయణ్'సినిమాలో సీత పాత్రలో నటిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కి భారీగా డేట్స్ కేటాయించిన సాయి పల్లవి, 2026 మధ్య నాటికి రామాయణ షూట్ పూర్తి అయిపోతుంది. ఆ తర్వాత నాగ్ అశ్విన్ తో ప్లాన్ చేసుకుంటారట. ఇక అఫిషియల్ అనౌన్స్ మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.
 

newsline-whatsapp-channel
Tags : kalki-2898-ad newslinetelugu nagashwin saipallavi

Related Articles