అల్లు వెంకటేష్ , అల్లు అర్జున్ ఇద్దరు సెట్ .ఇప్పుడు అల్లు శిరీష్ ను ఓ ఇంటివాడిని చేసే పనిలో పడ్డారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : టాలీవుడ్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ టాలీవుడ్ లో చాలా బడా ప్రొడ్యూస్ . సినిమా బిజినెస్ లో అల్లు ఫ్యామిలీ కి తిరుగేలేదు. ఇదే సమయంలో తన కొడుకులు అల్లు వెంకటేష్, అల్లు అర్జున్, అల్లు శిరీష్ లను చిత్ర పరిశ్రమలో నిలబెట్టేందుకు కూడా ఎంతో కష్టపడ్డారు. హీరోగా శిరీష్ ఎందుకో క్లిక్ అవ్వలేదు. నిజానికి మంచి స్కిల్స్ ఉన్నా కాని వర్కవుట్ కాలేదు. ఇక అల్లు వెంకటేష్ నిర్మాత గా కొనసాగుతున్నారు. అల్లు వెంకటేష్ , అల్లు అర్జున్ ఇద్దరు సెట్ .ఇప్పుడు అల్లు శిరీష్ ను ఓ ఇంటివాడిని చేసే పనిలో పడ్డారు.
అల్లు శిరీష్ కు 38 ఏళ్లు. అయినప్పటికీ ఇంకా అల్లు శిరీష్ బ్యాచిలర్ లైఫ్ నే లీడ్ చేస్తున్నారు. ఇక శిరీష్ కు పెళ్లి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలపై అల్లు ఫ్యామిలీ ఏం అనౌన్స్ చెయ్యలేదు . కాని పెళ్లి వార్తలు మాత్రం చాలా జోరుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
అల్లు ఫ్యామిలీకి ఈ ఏడాది బెస్ట్ ఇయర్ అని చెప్పాలి. పుష్ప తో నేషనల్ అవార్డు. . . వరల్డ్ వైడ్ ఫేమ్ . . . తీసుకున్న ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ లాభాలతో ఉన్నారు. తండేల్ వందకోట్లు . . . ఛావా కూడా సూపర్ కూల్ డీసెంట్ లాభాలు వచ్చాయి . ఈ ఏడాది దిల్ రాజు లాంటి వారికి భారీ నష్టాలు చూశారు. గేమ్ ఛేంజర్ , ఇండియన్ 2 లాంటి భారీ నష్టాలు వచ్చాయి. అల్లు కి మాత్రం లాభాలు దక్కాయి. మరి ఏడాది పెళ్లివార్త నిజమైతే అల్లు ఫ్యామిలీ కి మరో శుభవార్త జరిగినట్లే.