బాలీవుడ్ కు వెళ్లిన వారు సక్సస్ అయినవారి కంటే కెరియర్ ను పాడుచేసుకున్నవాళ్లే ఎక్కువ. సో రావిపూడి గ్రాఫ్ బాలీవుడ్ వల్ల పడిపోకూడదని ఫ్యాన్స్ అభిప్రాయం.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : తెలుగులో 100 శాతం సక్సస్ రేట్ ఉన్న డైరక్టర్ లో రాజమౌళి తర్వాత అనిల్ రావిపూడి ఒకరు. సంక్రాంతి కి వస్తున్నాం మూవీ తో ఈ ఏడాది హిట్ట్ కొట్టేశారు. ఏకంగా 300 కోట్ల గ్రాస్ వసూలు చేసి రీజనల్ సినిమాల్లో హైయెస్ట్ కలెక్ట్ చేసిన సినిమాగా రికార్డ్ సెట్ చేసారు. అయితే ఈ మూవీ తో అనిల్ రావిపూడికి ఫుల్ డిమాండ్ పెరిగింది. ఏకంగా మెగాస్టార్ తో సినిమా చేస్తున్నాడు. అంతేకాదు బాలీవుడ్ కి కూడా వెళ్లడానికి సర్వం సిధ్ధం చేసుకున్నాడట ఈ యంగ్ డైరక్టర్. నిర్మాత దిల్ రాజు సంక్రాంతికి వస్తున్నాం సినిమాని హిందీలో రీమేక్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాడట. అక్షయ్ కుమార్ ని హీరోగా సంక్రాంతికి వస్తున్నాం రీమేక్ ప్లాన్ చేస్తున్నాడట . ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యిందని టాక్. అయితే బాలీవుడ్ అంటే రావిపూడి ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే బాలీవుడ్ కు వెళ్లిన వారు సక్సస్ అయినవారి కంటే కెరియర్ ను పాడుచేసుకున్నవాళ్లే ఎక్కువ. సో రావిపూడి గ్రాఫ్ బాలీవుడ్ వల్ల పడిపోకూడదని ఫ్యాన్స్ అభిప్రాయం.
అయితే గతంలో ఓ సారి భగవంత్ కేసరి మూవీని తమిళ్ లో రీమేక్ చేద్దాం అనుకున్నారట అది కూడా విజయ్ దళపతితో కాని విజయ్ నేను రీమేక్స్ చెయ్యనని చెప్పడం తో ఈ సారి రీమేక్ కథ బాలీవుడ్ కి చేరింది. అయితే బాలీవుడ్ లో రావిపూడే డైరక్ట్ చేస్తారా లేక తన కథను బాలీవుడ్ లో వేరే డైరక్టర్ తో చేయిస్తారో క్లారిటీ ఇవ్వలేదు కాని సినిమా మాత్రం కన్ఫర్మ్ అయినట్లు టాక్స్ వినిపిస్తున్నాయి. అలాగే దిల్ రాజు వంశీ పైడిపల్లి- అమీర్ ఖాన్ కాంబోలో కూడా ఓ బాలీవుడ్ సినిమా ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే ఆమిర్ కి కథ చెప్పగా ఆమిర్ రిప్లై ఇంకా ఇవ్వలేదట. ఇస్తే ఈ డైరక్టర్ కూడా బాలీవుడ్ కి ఫ్లైట్ బుక్ చేసుకుంటున్నట్లే.