ఈ పెళ్లి జరిగితే ...విడిపోతారని ఇప్పుడు విజయ్ కెరియర్ బాగోలేదని ..మ్యారేజ్ ప్రాబ్లం కూడా ఉంటుందని వేణుస్వామి చెప్పారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : వేణుస్వామి మళ్లీ జోస్యం స్టార్ట్ చేశారు. చైతన్య .సమంత పెళ్లి విషయంలో జోస్యం చెప్పి ఫుల్ వైరల్ అయిపోయాడు. అయితే ఇప్పుడు దేవరకొండ జోస్యం చెప్పారు. ప్రజెంట్ రష్మిక , విజయ్ దేవరకొండ ఎంగేజ్మెంట్ ...పెళ్లి విషయాలు వైరల్ అవుతున్నాయి. దీనిపై జోస్యం చెప్పారు వేణుస్వామి. ఈ పెళ్లి జరిగితే ...విడిపోతారని ఇప్పుడు విజయ్ కెరియర్ బాగోలేదని ..మ్యారేజ్ ప్రాబ్లం కూడా ఉంటుందని వేణుస్వామి చెప్పారు.
సినీ నటులు విజయ్ దేవరకొండ , రష్మిక మందన్నా ఎంగేజ్మెంట్ చేసుకున్నారట దీని పై వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి . " వాళ్ల గురించి ఆల్రెడీ మనకు తెలుసు కదా ..గీత గోవిందం సినిమా నుంచే వాళ్లు తెలుసు . వాళ్లిద్దరు పెళ్లి చేసుకుంటారు. విడిపోతారు కూడా నేను నేరుగా ఆమెకే చెప్పాను . వేరే వాళ్లకు ఎందుకు చెప్పడం..ఆయనను చేసుకోకు విడిపోతావు అని చెప్పానుజ ఆ విషయం లోనే కద్ది నాకు ఆమెకు పొరపొచ్చాలు వచ్చాయి...ఆమె నన్ను పక్కకు పెట్టింది కూడా ...ఇందులో ప్రాబ్లం ఏం లేదు నాకు అభ్యంతరం కూడా లేదంటూ తెలిపారు.
అయినా ఆమె నా క్లయింట్ ...హీరోయిన్ అయితే నాకు అనవసరం. అలాగే, లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ జాతకాల్లో గురువు శుక్రుడు నీచంగా ఉన్నారు కాబట్టి వాళ్లు కూడా ఫ్యూచర్‌లో కలిసి ఉండే అవకాశాలు లేవని వేణుస్వామి మరో ఇంటర్వ్యూలో అన్నారు. జాతకంలో ఉండే దోషాలను బేస్ చేసుకొని తాను మాట్లాడతానని చెప్పారు. లావణ్య త్రిపాఠికి గురు దోషం ఉందని వరుణ్ తేజ్ కు నాగదోషం ఉందని అన్నారు. విజయ్ దేవరకొండ కెరీర్ బాగోలేదని అతడికి మ్యారేజ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటుందని వేణుస్వామి చెప్పారు. సమంత ,నాగచైతన్య గురించి కూడా తాను ముందుగానే చెప్పానని అన్నారు.