ఈ ప్రాజెక్ట్ కు మెయిన్ హీరోయిన్ గా ఇప్పటి వరకు దీపికా పదుకొణెను మాత్రమే ప్రకటించారు మేకర్స్.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ప్రజెంట్ తెగ వైరల్ అవుతున్నారు. సందీప్ రెడ్డి వంగా తో సున్నం తర్వాత మేడం కు రెండు సినిమాలు రెడ్ సిగ్నల్ పడ్డాయి. పోనీలే అట్లీ సినిమా అయినా చేతిలో ఉందంటే ఇప్పుడు అది కూడా డౌటే అంటున్నారు. స్పిరిట్ మూవీ లో సందీప్ తో బేరాలు తేలక దీపిక డిమాండ్లు భరించలేక సందీప్ లైట్ తీసుకున్నాడు. సేమ్ నాగఅశ్విన్ కూడా ఎందుకు ఈ రిస్క్ అని దీపిక ను వద్దనుకున్నారు. ఈ టైంలో దీపికా పదుకొణె చేతిలో ఉన్న ఒకే ఒక్క ప్రాజెక్ట్ AA22xA6. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో వస్తున్న మూవీ ఇది . ఈ ప్రాజెక్ట్ కు మెయిన్ హీరోయిన్ గా ఇప్పటి వరకు దీపికా పదుకొణెను మాత్రమే ప్రకటించారు మేకర్స్.
అయితే దీపికా పదుకొణె వరుసగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెగెటివ్ టాక్ తో క్యారీ అవ్వడం వ్లో మరి డీల్ కుదరకో తెలీదు కాని తన నెక్స్ట్ మూవీ AA22XA6 ప్రాజెక్ట్ పైనా ఎఫెక్ట్ పడినట్టు తెలుస్తోంది. ఈ మేరకు అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ విషయంలో దీపికా పదుకొణెకు ప్రాధాన్యత తగ్గించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఇంకా చెప్పాలంటే దీపిక క్యారక్టర్ తగ్గించి ..మరో హీరోయిన్ తో ఎక్కువ స్టోరీ నడిపించే అవకాశముందంటున్నారు సినీ వర్గాలు. అదే కాని జరిగితే దీపికకు సౌత్ లో ఇక మార్కెట్ కష్టమే. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ను మిస్ చేసుకోవడం ఆమె కెరియర్ కు అంత మంచిది కాదనే చెప్పాలి. ఇప్పుడు సౌత్ సినిమాలు దేశాలను ఏలుతున్నాయి. దీపిక ఓ బిడ్డకు తల్లయ్యాక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. నిజానికి కాస్త తగ్గి సినిమాలు ఓకే చెప్తే దీపిక కెరియర్ కు తిరుగు ఉండదు. లేదంటే కాస్త ఆలోచించాల్సిందే.