BIGBOSS9 : బిగ్ బాస్ లో సెలబ్రెటీస్ గుట్టురట్టు చేసిన మర్యాద మనీష్ !

కామనర్స్ ఏం చేసినా బయటకు వస్తుంది . కాని సెలబ్రెటీస్ ఏం చేసినా బయటకు రావడం లేదంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. 


Published Sep 29, 2025 07:03:00 PM
postImages/2025-09-29/1759152869_maryadamanishfeesmain1758470916.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : బిగ్ బాస్ ఫ్యాన్స్ కు ఇది పెద్ద షాకే. అక్కడ జరిగేది అంతా నిజం కాదు అంతా అబద్దం కాదు. ఈ విషయం ఎవరో కాదు బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ మర్యాద చెప్పారు . బిగ్ బాస్ 9 గేమ్ షో లో ఆల్రెడీ  ముగ్గురు వెళ్లిపోయారు. ఇద్దరు ఒక కామనర్స్ ..ఒక సెలబ్రెటీ బయటకు వచ్చేశారు. అయితే లాస్ట్ వీక్ వచ్చిన మర్యాద మనీష్ మాత్రం షాకింగ్ కామెంట్స్ చేశారు. అసలు అక్కడ జరుగుతున్న విషయాలు ఏవీ బయటకు రావడం లేదు . కామనర్స్ ఏం చేసినా బయటకు వస్తుంది . కాని సెలబ్రెటీస్ ఏం చేసినా బయటకు రావడం లేదంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. 


బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒకేసారి మమల్ని ఓనర్లు చేశారు. ఇక సెలెబ్రెటీలను టెనెంట్స్ ను చేశారు. వారికి ఎలాంటి ఫుడ్, లగ్జరీస్ ఇవ్వలేదు. దీంతో వాళ్లకి చాలా కోపం వచ్చింది. ఏం చేసినా గొడవలు పెట్టుకునేవారు. కాని ఆ చిన్న చిన్న గొడవలు బయటకు రానివ్వలేదు బిగ్ బాస్. ఇలా పనులు చెయ్యడం సెలబ్రెటీస్ కు చాలా మంచి బెనిఫిట్ అయ్యింది. కామనర్స్ గా లగ్జరీస్ మేం అనుభవించడం జనాల్లో చాలా నెగిటివ్ వచ్చేసింది. మాకు అసలు అది అక్కడ అర్దం కాలేదు. అందులోను కామనర్స్ కు అసలు అందరూ ఒక మాట మీద లేరు అది కూడా ప్రాబ్లమే.


 కనిపిస్తున్నది ఒకటి లోపల జరిగేది ఒకటి. ఆ విషయంలోనే నేను ఎఫెక్ట్ అయ్యాను. అక్కడ ప్రతి ఒక్కరికీ స్ట్రాటజీలు ఉన్నాయి. ఇంకా మాస్క్ లు తీయడం లేదు. రాను రాను తీస్తారు. కామనర్స్ యూనిటీ బ్రేక్ అయిపోయింది. సగం గొడవలు రీతూ వల్లే జరుగుతున్నాయి ..ఫుడ్ దగ్గర చాలా గొడవలు పెట్టేస్తుందంటూ చాలా విషయాలు బయటపెట్టారు. 
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu bigboss9 reethu-choudary tanuja immanual sanjana

Related Articles