9 మంది సెలబ్రెటీలు, ఆరుగురు కామనర్స్‌తో కలిపి మొత్తం 15 మందితో బిగ్‌బాస్ తెలుగు 9 స్టార్ట్ అయింది. మొదటివారం శ్రష్టి ..రెండో వారం మర్యాద మనీశ్ ..ఇప్పుడు హౌస్ లో 13 మంది ఉన్నారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: బిగ్ బాస్ తెలుగు 9 లో మూడో వారం క్రేజీ ఉండబోతుంది. ఎప్పటిలాగే థర్డ్ వీక్ కూడా నామినేషన్స్ హోరా హోరీ గా జరిగాయి. అయితే ఈ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రానున్నాయనే ప్రచారం జరుగుతుంది. అలా అయితే డబుల్ ఎలిమినేషన్ తప్పదంటున్నారు రివ్యూవర్స్. అలా కాని డబుల్ ఎలిమినేషన్ అయితే ఎవరెవరు బయటకు వెళ్లిపోతున్నారనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ ఆన్ ఫైర్ లో వైరల్ అవుతుంది.
9 మంది సెలబ్రెటీలు, ఆరుగురు కామనర్స్‌తో కలిపి మొత్తం 15 మందితో బిగ్‌బాస్ తెలుగు 9 స్టార్ట్ అయింది. మొదటివారం శ్రష్టి ..రెండో వారం మర్యాద మనీశ్ ..ఇప్పుడు హౌస్ లో 13 మంది ఉన్నారు. వీరిలో ఎలిమినేషన్ కోసం నామినేషన్స్ జరగ్గా.. మొత్తంగా మూడో వారం ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. వారు పవన్ కళ్యాణ్, ప్రియ, హరీష్, రీతూ చౌదరి, ఫ్లోరా షైనీ, రాము రాథోడ్.
నామినేషన్స్ అయిపోయాక కెప్టెన్ డీమోన్ పవన్ స్పెషల్ పవర్ తో శ్రీజను సేవ్ చేశాడు. డీమాన్ ను కెప్టెన్ ను చేసిందే రీతూ ..తన పేరు చెప్పకుండా ఇలా శ్రీజ పేరు చెప్పడంతో రీతూ చాలా బాధపడి..కన్నీళ్లు కూడా పెట్టుకుంది. అటు దమ్ము శ్రీజ కూడా తనని ఓనర్లు అందరూ నెగిటివ్ అంటూ నామినేట్ చేశారని శ్రీజ ఏడ్చేసింది. అయితే ఇమ్మూ వచ్చి చెల్లి అంటూ ఓదార్చడంతో శ్రీజ చల్లబడింది. రీతూ ను ఓదార్చడానికి పవన్ ఎలానూ ఉన్నాడు. రీతూ కంట్లో నీళ్లు రాకుండా చాలా జాగ్రత్త ఏడ్చింది. పవన్ ఓదార్చాడు కూడా.
ఇక సోషల్ మీడియాలో జరుగుతున్న డిస్కషన్స్‌ను బట్టి బిగ్‌బాస్ తెలుగు 9 థర్డ్ వీక్ ఓటింగ్ విషయానికి వస్తే.. ఓటింగ్స్ తారుమారు అవుతున్నాయి. ఫ్లోరా షైనీ, రాము రాథోడ్‌లు నువ్వా, నేనా అన్నట్లుగా బయటకు వెళ్లడానికి పోటీపడుతున్నారు. టాప్ లో రాము రాథోడ్ ఉన్నారు . ఇక ఓటింగ్ లాస్ట్ లో రీతూ చౌదరి , ప్రియ ఉన్నారు. డబుల్ ఎలిమినేషన్ కాని పడితే పక్కా ప్రియ, రీతూ ఇద్దరు గుడ్ బై చెప్పాల్సిందే తప్పదు. అలా కాదు సింగిల్ ఎలిమినేషన్ అయినా కాని ఈ సారి ప్రియ మేడం బయటకు వచ్చేసే ఛాన్సులే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక వీక్ మిడ్ లో ఉన్నాం కాబట్టి ఏమైనా ఓటింగ్ తారుమారు అయితే రీతూ బై బై చెప్పొచ్చు.