మొదటివారం శ్రష్టివర్మ కు గుడ్ బై చెప్పేశారు అయితే ఈ వారం మాత్రం ఫ్లోరా షైనీ కాని ప్రియాశెట్టి కాని బయటకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : బిగ్ బాస్ 9 రియాలిటీ షో ప్రజెంట్ జనాల్లో బాగా బజ్ క్రియేట్ చేసింది. టెనెంట్స్ vs ఓనర్స్ మధ్య చిచ్చు బాగానే రాజుకుంది. కామనర్స్ కు బయట అసలు పాజిటివ్ టాక్ లేదు. సెలబ్రెటీస్ ను బతకనివ్వడం లేదనేది బయట టాక్ . అలా అయినా సరే ..ఫ్యాన్ బేస్ లు ఎవరికి వాళ్లు ఫ్యాన్ గ్రూప్స్ క్రియేట్ చేసుకొని ఇన్ స్టా లో తెగ హడావిడి చేస్తున్నారు. ఈ సీజన్లో 2.0 ద్వారా మరో ఐదుగురు కంటెస్టెంట్లను పంపించేందుకు ఎండెమాల్ షైన్ ఇండియా గ్రూప్ ప్లాన్ చేసినట్టు సమాచారం. అయితే మొదటివారం శ్రష్టివర్మ కు గుడ్ బై చెప్పేశారు అయితే ఈ వారం మాత్రం ఫ్లోరా షైనీ కాని ప్రియాశెట్టి కాని బయటకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
అయితే ఓటింగ్ లో సుమన్ శెట్టి ఉన్నారు. సుమన్ శెట్టి కి బయట ఫ్యాన్ బేస్ కూడా చాలా గట్టిగా క్రియేట్ అయ్యింది. తనూజ కూడా అంతే. తనూజ కు కూడా ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. నాగార్జున మా అన్నపూర్ణ ప్రాడెక్ట్ అని గర్వంగా చెప్పుకోవడం ...తనూజ బిహేవియర్ కూడా బాగుండడంతో జనాలు ఆమెను కూడా ఇష్టపడుతున్నారు. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఐదుగురుని పంపాలని ప్లాన్ చేస్తున్నారట బిగ్ బాస్ . అయితే ఆ ఐదుగురు ఎవరనేది సోషల్ మీడియాలో తెగ డిస్కర్షన్స్ అవుతున్నాయి. అయితే సెలక్షన్స్ కంప్లీట్ అయ్యాయి. ఓ ఈవెంట్ ఏర్పాటు చేసి వైల్డ్ కార్డ్స్ ను ఎంట్రీ చెయ్యాలని ఆలోచిస్తున్నారట. అయితే మరో కామన్ మ్యాన్ ఇంట్లో అడుగు పెట్టే అవకాశం ఉంది. కామన్ మ్యాన్స్ నుంచి నాగ ప్రశాంత్, సెలబ్రిటీల నుంచి రమ్య పికిల్, సింగర్ శ్రీ తేజ, దివ్వెల మాధురి, జ్యోతి రాయ్‌ని ఎంపిక చేసినట్టు సమాచారం.