ఇండియన్స్ చాలా పెద్ద సంఖ్యలో స్థిరపడిన దేశాల్లో కెనడా కూడా ఒకటి. వృత్తి , ఉద్యోగ వ్యాపారాల కోసం దశాబ్దాల క్రితం కెనడా లో చాలా ఏళ్లుగా సెటిల్ అయిపోయారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఇండస్ట్రీ అంతా కాంతార చాప్టర్ 1 బ జ్ లో ఉంది. ఓజీ మత్తు దిగిందనేసరికి ... .కాంతార బజ్ క్రియేట్ అయ్యింది. అయితే కాంతార చాప్టర్ 1 ను రిలీజ్ అవుతుందా లేదా అన్న డౌట్స్ స్టార్ట్ అయ్యాయి. అయితే వివాదం సమసిపోవడంతో ఓజీ రిలీజ్ కావడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తోంది. రీసెంట్ గా ఓజీ షోలు కెనడాలో ఉన్న పళంగా క్యాన్సిల్ అయ్యాయి. ఓజీతో పాటు రెండ్రోజులు క్రితం రిలీజైన కాంతార చాప్టర్ 1 , వేరే ఇండియన్ చిత్రాల స్క్రీనింగ్ ఆగిపోయింది.
ఇండియన్స్ చాలా పెద్ద సంఖ్యలో స్థిరపడిన దేశాల్లో కెనడా కూడా ఒకటి. వృత్తి , ఉద్యోగ వ్యాపారాల కోసం దశాబ్దాల క్రితం కెనడా లో చాలా ఏళ్లుగా సెటిల్ అయిపోయారు. అయితే ఇప్పుడు కెనడాలో పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి. దీనికి ఇండియన్ సిటిజన్స్ ఈ పరిస్థితులకు కారణమవుతున్నారు. ముఖ్యంగా పంజాబ్ ను భారత్ నుంచి విడదీసి ప్రత్యేకంగా ఖలిస్తాన్ దేశాన్ని ఇవ్వాలని అక్కడ పోరాటం జరుగుతుంది. పంజాబ్ లో ఖలిస్తాన్ వేర్పాటువేదాన్ని భారత్ గవర్నమెంట్ అణిచివేయగా ..కెనడా , ఆస్ట్రేలియా , యూకే తదితర దేశాల నుంచి సిక్కులు ఉద్యమాన్ని నేటికి కొనసాగిస్తున్నారు. గత కొద్దినెలలుగా ఈ ఉద్యమం హింసాత్మకంగా మారుతుంది. ఖలిస్తాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాతి నుంచి ఖలిస్తాన్ వేర్పాటువాదులు రెచ్చిపోతున్నారు.
అయితే వేర్పాటు వాదులు రెచ్చిపోయి...హిందుదేవాలయాలను టార్గెట్ గా చేసుకొని దాడులను తెగబడుతున్నారు. ఆలయాలపై పిచ్చిరాతలు రాయడం, కెనడాలో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీలు, ధర్నాలు, ఖలిస్తాన్ రిఫరెండంలతో కెనడాలో పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి. అయితే ఒంటారియో ప్రావిన్స్ లో కొంతమంది అల్లరిమూకలు ఓ థియేటర్ కారిడార్ లో ఇద్దరు ముసుగు ధరించిన వ్యక్తులు పెట్రోల్ లాంటి రసాయనం చల్లి నిప్పంచించడం కలకలం రేపింది. అక్టోబర్ 2వ తేదీన ముసుగులో వచ్చిన మరో వ్యక్తి ఏకంగా థియేటర్ పై కాల్పులకు తెగ బడ్డాడు. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఓక్‌విల్లేలో ఓజీ, కాంతార చాప్టర్ 1 చిత్రాల ప్రదర్శనను నిలిపి వేస్తున్నట్లు ఫిల్మ్. సీఏ సినిమాస్ తెలిపింది. ఆన్ లైన్ బుకింగ్ లిస్ట్ నుంచి ఇండియన్ సినిమాలను తొలగించినట్లు యార్క్ సినిమాస్ తెలిపింది. గ్రేటర్ టోరంటోతో పాటు బ్రిటిష్ కొలంబియా, ఆల్బెర్టా , క్యూబెన్ , మానిటోబా ప్రావిన్స్ లలోనూ ఇండియన్ సినిమాల షోలను నిలిపివేయాలని భావిస్తున్నారు. ఇది కూడా ఖలిస్తాన్ వేర్పాటువాదుల హస్తం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి.