చిరు ఫస్ట్ మూవీ " ప్రాణం ఖరీదు " విడుదలై నేటికి సరిగ్గా 47 ఏళ్లు పూర్తయిన సంధర్బంగా ఈ ట్వీట్ ను పోస్ట్ చేశారు మెగాస్టార్.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి పేరు ఈ రోజు ఏ రేంజ్ లో వినిపిస్తుంది అందరికి తెలిసిందే. తన సినీ ప్రయాణం మొదలై ఈ రోజుకు కరెక్ట్ గా 47 ఏళ్లు ..ఈ విషయాన్ని చిరంజీవి గుర్తు చేసుకుంటూ ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ గా మారింది.తన సినీ ప్రయాణాన్ని 1978లో ప్రారంభించి, 47 ఏళ్లుగా టాలీవుడ్ కు ఐకాన్ గా మారారు. చిరు ఫస్ట్ మూవీ " ప్రాణం ఖరీదు " విడుదలై నేటికి సరిగ్గా 47 ఏళ్లు పూర్తయిన సంధర్బంగా ఈ ట్వీట్ ను పోస్ట్ చేశారు మెగాస్టార్.
ఆ ట్వీట్ లో ఏం చెప్పారంటే “22 సెప్టెంబర్ 1978… కొణిదెల శివ శంకర వరప్రసాద్ అనే నేను ‘చిరంజీవిగా’ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాను. అప్పటి నుంచి నన్ను తమ అన్నగా ...తమ్ముడిగా ...కొడుకుగా ఇలా కుటుంబసభ్యుడుగా అనుకొని ఆదరిస్తున్నందుకు చాలా రుణపడి ఉంటానని తెలిపారు. ఈ ప్రేమే నన్ను 155 సినిమా లు చేసేలా చేసిందన్నారు. 70 ఏళ్ల వయసులోనూ యువ హీరోలకు సమానంగా పోటీ ఇస్తూ వరుస సినిమాలు చేస్తున్నారు. ఈ ఇన్నాళ్ల సినీ ప్రయాణంలో వచ్చిన ప్రతి అవార్డు, ప్రతి రివార్డు మీ అందరివే ..మీ వల్లే నాకు ఈ గౌరవం దక్కిందని తెలిపారు.
ఈ పోస్ట్ తో #47YearsOfChiranjeeviEra అనే హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. చిరు సినిమాల్లో హీలిరియస్ ...హీరోయిజం ...క్లిప్స్ ఫుల్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం చిరంజీవి మన శంకర్ వరప్రసాద్ గారు అనే సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు. మరోవైపు విశ్వంభర పనులు కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. మెగాస్టార్ ప్రయాణం మరింత జోరుగా జరగాలని ...కామెంట్లు చేస్తున్నారు ఫ్యాన్స్.
22 సెప్టెంబర్ 1978
'కొణిదెల శివ శంకర వరప్రసాద్' అనబడే నేను “ప్రాణం ఖరీదు” చిత్రం ద్వారా 'చిరంజీవిగా' మీకు పరిచయం అయ్యి నేటితో 47 ఏళ్లు దిగ్విజయంగా పూర్తయ్యాయి. ఈ చిత్రం ద్వారా నాకు నటుడిగా ప్రాణం పోసి.., మీ అన్నయ్యగా, కొడుకుగా, మీ కుటుంబ సభ్యుడిగా , ఒక మెగాస్టార్ గా.. అనుక్షణం… pic.twitter.com/1VSVTu9Kkz — Chiranjeevi Konidela (@KChiruTweets) September 22, 2025