ABHYANKAR: ఇక ఫ్యూఛర్ సినిమాలన్నీ ఈ యంగ్ మ్యూజిక్ డైరక్టర్ వే!

బాల్టీ మూవీలో అభ్యంకర్ మ్యూజిక్ మెయిన్ హైలెట్ ...తన వల్లే సినిమా 80 శాతం హిట్టు కూడా కొట్టిందని మూవీ టీం అంతా ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు కూడా.


Published Sep 29, 2025 03:22:00 PM
postImages/2025-09-29/1759139701_1906429untitleddesign1.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఓజీతో తమన్ పేరు ఇండస్ట్రీ లో గట్టిగా వినిపిస్తున్నా...తమన్ కు పోటీ ఇచ్చే వాడు మరొకడు ఉన్నాడంటున్నారు ఇండస్ట్రీ ఎక్స్ పర్ట్స్ . రీసెంట్ మలయాళం సినిమా బాల్టీ మూవీ తో  సూపర్ డూపర్ హిట్ కొట్టిన అభ్యంకర్ ...ఇప్పుడు ఇండస్ట్రీ లో సెన్సేషన్ అవ్వబోతున్నాడని జోస్యం చెబుతున్నారు సినీ పెద్దలు. కట్ చేస్తే సెకండ్ సినిమాకే అభ్యంకర్ భారీ రెమ్యునరేషన్ ఇవ్వడానికి ప్రొడ్యూసర్లు క్యూ కడుతున్నారట. అంతేకాదు ఈ బాల్టీ అభ్యంకర్ కు మొదటి సినిమా అయినా రెండు కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకున్నాడట. ఇప్పుడు డబుల్ ఇవ్వడానికి ప్రొడ్యూసర్లు లైన్లో ఉన్నారట అంతేకాదు అన్ని ఇండస్ట్రీ ల నుంచి కాల్స్ కూడా వెళ్తున్నాయట. అయితే బాల్టీ మూవీలో అభ్యంకర్ మ్యూజిక్ మెయిన్ హైలెట్ ...తన వల్లే సినిమా 80 శాతం హిట్టు కూడా కొట్టిందని మూవీ టీం అంతా ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు కూడా.


రీసెంట్ గా ఓ బడా ప్రొడ్యూసర్ ఓ సీక్రెట్ బయటపెట్టాడు. బాల్టీ మూవీ ఫస్ట్ రిలీజ్ అయ్యింది కాని బడా ప్రొడ్యూసర్లు ..బడా హీరోల సినిమాలు ఇంకా పది సినిమాలు తన దగ్గర పెండింగ్ లో ఉన్నాయనే విషయం బయటకు చెప్పాడు. మాలీవుడ్ కు బాల్టీ ఇండస్ట్రీ హిట్. అంతేకాదు అభ్యంకర్ కు ఇచ్చినంత రెమ్యూనిరేషన్ మలయాళంలో ఏ మ్యూజిక్ డైరక్టర్ కు ఇవ్వలేదట. దీంతో ఇప్పుడు అన్ని ఇండస్ట్రీల్లో ఇప్పుడు అభ్యంకర్ సూపర్ హాట్ టాపిక్ .


ఇంతకీ సాయి అభ్యంకర్ ఎవరంటే ..ప్రముఖ సింగర్స్ టిప్పు, హరిణి పేరెంట్స్ పేర్లు ఎక్కడా వాడకుండా ...తన సొంత టాలెంట్‌తోనే గుర్తింపు తెచ్చకున్నాడు సాయి అభ్యంకర్. ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ ఒక్కో మెట్టు ఎక్కాడు ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలు ..పెద్ద హీరోలు సినిమాలున్నాయట. అందులో అల్లు అర్జున్ - అట్లీ మూవీ కూడా ఉందని టాక్. ఈ సినిమాకు హాలివుడ్ రేంజ్ మ్యూజిక్ అందించే ప్రయత్నం లో ఉన్నారట అభ్యంకర్. తమిళ్ లో సూర్య కరుప్పు, లారెన్స్ బెంజ్ , శింబు 49 మార్షల్ , డ్యూడ్ లాంటి మూవీస్ కు అభ్యంకర్ మ్యూజిక్ ఇవ్వనున్నారట. ప్రజెంట్ సోషల్ మీడియా అంతా అభ్యంకర్ మాటలే ..చూడాలి మరి అభ్యంకర్ ఏ రేంజ్ ఫేమస్ అవుతారో .
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu singer malayala-industry music-director

Related Articles