స్పిరిట్ మూవీ వివాదం తర్వాత రీసెంట్ గా నాగ్ -అశ్విన్ - ప్రభాస్ కాంబినేషన్ లో భారీ మైథలాజికల్ సైంటిఫిక్ యాక్షన్ ఫిల్మ్ కల్కి 2898 ఏడీ సీక్వెల్ నుంచి కూడా మేకర్స్ ఆమెను తొలగించారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: దీపికా పదుకొనే బాలీవుడ్ టాప్ హీరోయిన్ ..ఎప్పుడైతే స్పిరిట్ నుంచి తప్పుకుందో ఇక అక్కడ నుంచి మేడం బలుపు బరించలేక రెండు ప్రాజెక్ట్స్ నో థాంక్స్ చెప్పేశారు. అయితే మేడం తో ప్రొడ్యూసర్లు పడ్డ కష్టాలు బయటపడతున్నాయి. ఇప్పుడు సక్సెస్ వచ్చాక కాదు ముందు నుంచే మేడం కాస్త బలుపుమనిషి. ఆమె డిమాండ్లను తట్టుకోలేక దర్శక నిర్మాతలే ఆమెకు గుడ్ బై చెబుతున్నారు.
స్పిరిట్ మూవీ వివాదం తర్వాత రీసెంట్ గా నాగ్ -అశ్విన్ - ప్రభాస్ కాంబినేషన్ లో భారీ మైథలాజికల్ సైంటిఫిక్ యాక్షన్ ఫిల్మ్ కల్కి 2898 ఏడీ సీక్వెల్ నుంచి కూడా మేకర్స్ ఆమెను తొలగించారు. ఆమెతో సరైన ఒప్పందం లేకపోవడంతో తన అగ్రిమెంట్ ను బ్రేక్ చేసుకున్నారని టాక్. అయితే కల్కి 2898 ఏడీ ప్రాజెక్ట్ లో దీపికా పదుకొణె ఉండబోదని వైజయంతి మూవీస్ సంస్థ అధికారికంగా ప్రకటించింది.
అయితే దీపికా గత విషయాలు కూడా బయటకి వస్తున్నాయి. కాగా దీపికా గతంలో ఓ బాలీవుడ్ నిర్మాతను ఇలానే బోలెడు డిమాండ్లు పెట్టి నట్టింట ముంచేసిందట. బాలీవుడ్ ప్రొడ్యూసర్ రమేశ్ తౌరానీ బాలీవుడ్ మీడియాతో చెప్పారు. 13 ఏళ్ల కిందనే దీపికా పదుకొణె నిర్మాతకు చుక్కులు చూపించిందట. ఓ ప్రాజెక్ట్ ఓకే చేసి కొన్ని రోజులు చేసి మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయిందట.
2012లో బాలీవుడ్ దర్శకుడు అబ్బాస్-ముస్తాన్ రేస్ 2 అనే యాక్షన్ క్రైమ్ ఫిల్మ్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీలో సైఫ్ అలీఖాన్, జాన్ అబ్రహం, దీపికా పదుకొణె మెయిన్ లీడ్స్ చేశారు. అయితే ఈ మూవీకి రమేశ్ తౌరానీ నిర్మాతగా వ్యవహరించారు. 2013 లో జనవరి 25 న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా చాలా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద రూ.173 కోట్ల గ్రాస్ ను అందుకుంది. లాభాలు వచ్చినా కాని ప్రొడ్యూసర్ కు మాత్రం మూడు చెరువుల నీళ్లు తాగించిందట దీపికా.
ఇక రేస్ 2కు కేవలం 6 రోజులు షూటింగ్ కు హాజరై ఆ తర్వాత సెట్ కు రావడం మానేసిందంట దీపికా పదుకొణె. ఫోన్ చేస్తే లిఫ్ట్ చెయ్యరు..మెసేజ్ కు రిప్లై ఉండదు...హాలీవుడ్ లో అవకాశం వచ్చిందని అందుకే ఈ ప్రాజెక్ట్స్ ఆపేశానని చాలా పొగరుగా చెప్పిందట.5 రోజుల పాటు ఆమె ముంబైలోనే లేదని చెప్పారంట. దాంతో నిర్మాతకు ఏం చేయాలో అర్థం కాలేదంట. రమేశ్ తరానా ఈ టైంలో మీడియాకు చెప్పడం వైరల్ గా మారింది.