dimple hayathi: మరోసారి కాంట్రవర్సీలో ఇరుక్కున్న డింపుల్ హయాతి !

ఏం చేసుకుంటారో చేసుకోమని చెప్తున్నారని తెలిపింది. అంతేకాదు మీరు చాలా చీప్ అని అనడం చాల బాధాకరం అని తెలిపింది.


Published Sep 30, 2025 08:25:49 AM
postImages/2025-09-30/1759237784_dimplehayathicontroversywithdomesticworkers.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : డింపుల్ హయాతి ..పెద్దగా పరిచయాలు అవసరం లేదు. పాపం సినిమాల్లో కంటే కాంట్రవర్సీల్లో కనిపిస్తుంది ఈ బ్యూటీ ..అప్పుడెప్పుడో చాలా ఏళ్ల క్రితం ఓ ఐపీఎస్ ఆఫీసర్ తో పార్కింగ్ విషయంపై వచ్చిన గొడవ పెద్ద దుమారమైంది . అప్పటి నుంచి పెద్దగా సినిమాల్లో అమ్మడు కనిపించలేదు . అవకాశాలు కూడా పెద్దగా లేవు.  అయితే ఫస్ట్ కాంట్రవర్సీ ని జనాలు మరిచిపోయారో లేదో మరోసారి కాంట్రవర్సీలో పడింది.


ఇంతకీ కాంట్రవర్సీ ఏంటంటే మేడం రీసెంట్ గా షేక్‌పేటలోని వంశీరామ్ వెస్ట్ వుడ్స్ అపార్ట్మెంట్‌కు షిఫ్ట్ అయ్యింది. అక్కడ ఆమె పెట్స్ కోసం ఇద్దరు గర్ల్స్ ను హోమ్ స్టాఫ్ గా పెట్టుకుంది. అయితే వారిని ఆమె సరిగ్గా చూసుకోకుండా వాళ్లని టార్చర్ చేస్తుందని ఓ లేడీ తన సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చెయ్యడం ఫుల్ వైరల్ అవుతుంది. అందులో ఆవిడ చెప్పిన మాటలు ఏంటంటే డింపుల్ భర్త ఆ అమ్మాయిలను హింసించాడని ఏమైనా అంటే తమ వద్ద లాయర్లు ఉన్నారు ..ఏం చేసుకుంటారో చేసుకోమని చెప్తున్నారని తెలిపింది. అంతేకాదు మీరు చాలా చీప్ మనుషులు  అంటున్నాడని అని కూడా  తెలిపింది.


ఇంతకీ ఎవరా లేడీ అంటే ...ఆ ఇద్దరు అమ్మాయిలను డింపుల్ ఇంట్లో పనికి పెట్టిన లేడీ ఈవిడే. డింపుల్ వారిని సరిగ్గా చూసుకోవడం లేదని మెంటల్ టార్చర్ పెడుతూ ఎప్పుడు అనుమానిస్తూ ఉంటుందని ఆవిడ ఆ వీడియోలో చెప్పారు. అంతేకాదు ఆవిడ మాట్లాడుతూ డింపుల్ భర్త కూడా ఇలానే ఉంటాడని చెప్పడం ఫుల్ వైరల్ అవుతుంది. ఇంతకీ డింపుల్ కి పెళ్లైందా అనేదే  నెటిజన్ల క్వశ్చన్. దీని పై డింపుల్ రియాక్ట్ అవ్వాల్సి ఉంది. అయితే డింపుల్ చేతిలో ఒక్ సినిమా ఉంది . శర్వానంద్ తో కలిసి " భోగి" అనే సినిమాకు సైన్ చేసింది డింపుల్ . ఈ మూవీ సంపత్ నంది డైరక్షన్ లో తెరకెక్కింది. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ అవుతుంది కూడా. ఈ మూవీతో మళ్లీ ఫుల్ బిజీ అవ్వాలని ఉన్నా ...ఎందుకో పెద్ద గా ఇండస్ట్రీ పెద్దలు ఆమెను చూడ్డం లేదు. ఈ టైంలో మరో కాంట్రవర్సీలో చిక్కుకుంది డింపుల్ బేబీ. 
 

newsline-whatsapp-channel
Tags : india-people marraige viral-video heroine

Related Articles