ED RAIDS : మలయాళం హీరోలు దుల్కర్ , పృథ్వీరాజ్ పై ఈడీ దాడులు !

కస్టమ్స్ అధికారులు సోదాలు నిర్వహించి..ఆపరేషన్ నమకూర్ పేరుతో ఈ సోదాలు నిర్వహించారు. అయితే ఇందులో భాగంగానే ఓ ఇంట్రస్టింగ్ వార్త బయటకు వచ్చింది. 


Published Sep 23, 2025 07:31:00 PM
postImages/2025-09-23/1758636162_dulquerprithvinepod.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ :మలయాళం ఇండస్ట్రీ ఈ మధ్య సినిమాలతో కాదు రూమర్స్ ..గాసిప్స్ ..కాంట్రవర్సీలతో ఫేమ్ లోకి వస్తుంది. అప్పుడంతా మీ టూ గోల అయితే ..ఇప్పుడు మలయాళం హీరోలపై ఈడీ దాడులు వార్తల్లోకి వచ్చాయి. మలయాళం స్టార్ హీరోలు ..దుల్కర్ సల్మాన్ పృథ్వీ రాజ్ లాంటి స్టార్ హీరోలపై ఈడీ దాడులు జరిపింది. ఉదయం కస్టమ్స్ అధికారులు సోదాలు నిర్వహించి..ఆపరేషన్ నమకూర్ పేరుతో ఈ సోదాలు నిర్వహించారు. అయితే ఇందులో భాగంగానే ఓ ఇంట్రస్టింగ్ వార్త బయటకు వచ్చింది. 


రీసెంట్ గా భూటాన్‌ లో కొన్ని ఖరీదైన వాహనాలను వేలం వేస్తే వాటిని తక్కువ ధరకు కొనుక్కొని కొంతమంది అక్రమంగా ఎలాంటి కస్టమ్స్‌ డ్యూటీ చెల్లించకుండా ఇండియాకు స్మగ్లింగ్‌ చేశారని ఈడీ దాడులు చేసింది. దాడులు చేశాక తీరా తెలిసింది ఏంటంటే దుల్కర్ , సుకుమారన్ ఇద్దరు ఏ లగ్జరీ కార్లు స్మగ్లింగ్ చేయించుకోలేదని . కాని ఈ డీ దాడుల వల్ల మలయాళం హీరోలు రోజంతా టెన్షన్ టెన్షన్ పడ్డారట.ఈ దాడుల్లో భాగంగా తిరువనంతపురంలో ఉన్న పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఇళ్లతో పాటు, పనంపిల్లి నగర్‌లోని ఉన్న దుల్కర్‌ ఇంట్లో సోదాలు చేశారు. అయితే వారి వద్ద నిబంధనలకు విరుద్ధంగా గతంలో దుల్కర్ ఓ ఇంటర్వ్యూలో తనకు కార్లంటే ఇష్టమని, లగ్జరీ కార్లు చాలానే ఉన్నాయని, తన ఇంట్లోనే కాకుండా హైదరాబాద్ లో కూడా కార్లు దాస్తానని చెప్పుకొచ్చాడు.


 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu dulkar-salman malayala-industry

Related Articles