ఈ స్టాట్యూ వీడియోను రిపబ్లికన్ నేత అలెగ్జాండర్ డంకన్ పోస్ట్ చేస్తూ .." టెక్సాస్ లో అసత్య హిందూ దేవుడి , అసత్య విగ్రహాన్ని ఉండనిస్తున్నాం..హిందూ దేవుళ్లను మనం ఎందుకు అనుమతించాలి
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : హనుమాన్ " అసత్య హిందూ దేవుడు " అంటూ హనుమంతుడిపై అమెరికలోని ఓ రిపబ్లికన్ నేత సంచలన కామెంట్లు చేశారు. శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామిజీ చొరవతో 2024లో అమెరికాలోని టెక్సాస్‌లో ‘స్టాచ్యూ ఆఫ్ యూనియన్’ నెలకొల్పారు. షుగర్ ల్యాండ్ లో ఉన్న ఈ 90 అడుగుల హనుమాన్ విగ్రహం అత్యంత ఎత్తైన హిందూ స్టాట్యూస్ లో ఒకటి . ఇది అమెరికా లో మూడో అత్యంత ఎత్తైన విగ్రహం.
ఈ స్టాట్యూ వీడియోను రిపబ్లికన్ నేత అలెగ్జాండర్ డంకన్ పోస్ట్ చేస్తూ .." టెక్సాస్ లో అసత్య హిందూ దేవుడి , అసత్య విగ్రహాన్ని ఉండనిస్తున్నాం..హిందూ దేవుళ్లను మనం ఎందుకు అనుమతించాలి మనది క్రిస్టియన్ దేశం కదా అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. " నీకు నేను మాత్రమే దేవుడిని ..ఇతర దేవుడు ఉండకూడదు. నువ్వు ఆకాశంలో భూమిలో సముద్రంలో అలాంటి విగ్రహాలు ఇమేజ్ లు క్రియేట్ చేసుకోకూడదు. అని బైబిల్ వ్యాఖ్యలను ఆయన పోస్ట్ చేశారు. డంకన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్లుతో నిండిపోయింది. ఆయన చేసిన వ్యాఖ్యలపై హిందూ అమెరికన్ ఫౌండేషన్ స్పందించింది.
అమెరికా రాజ్యాంగం ఏ మతాన్నైనా ఆచరించే స్వేచ్ఛను ఇస్తుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.జోర్డన్ క్రౌడర్ అనే యూజర్ స్పందిస్తూ.. హిందూ కానంత మాత్రాన, ఇతర మత దేవుడు నిజమైన దేవుడు కాదనేలా కామెంట్స్ చేస్తే ఎలా అని ప్రశ్నించాడు. వేదాలను ఏసు పుట్టకముందే 2000 సంవత్సరాల ముందే రాశారని అన్నారు. అవి అసాధారణ బుక్స్ అని , క్రిస్ట్రియన్ మతం పై వాటి ప్రభావం స్పష్టంగా ఉందని చెప్పారు. ఒక మతంలో ఉన్న మంచిని తీసుకొని మరో మతాన్ని గౌరవిస్తూ వెళ్లాలని అంటున్నారు నెటిజన్లు.