SUDIGALI SUDHEER : సుడిగాలి సుధీర్ పై చెయ్యి చేసుకున్న ఫరియా అబ్దుల్లా !

ఆమె డ్యాన్స్ కూడా చాలా బాగా చేస్తుంది. అయితే ఈ మధ్య చాలా డ్యాన్స్ కాంపిటీషన్స్ , ఈ వెంట్స్ లో సందడి చేస్తూ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.


Published Sep 20, 2025 01:05:00 PM
postImages/2025-09-20/1758353817_fariaabdullahslappedanchorsudigalisudheerdis1758305251.jpg

 న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : టాలీవుడ్ లో ఏడుడుగుల హీరోయిన్ ఎవరైనా ఉన్నారా ...సింగిల్ నేమ్ ఫరియా అబ్ధుల్లా ..జాతి రత్నాలతో టాలీవుడ్ కుర్రాళ్లకి చెమటలు పట్టించిన ఈ చిట్టి ...ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బుల్లితెర యాక్టర్ , యాంకర్ అయిన సుడిగాలి సుధీర్ ను ఫరియా చెంప దెబ్బ కొట్టడం తెగ వైరల్ అయిపోతుంది.  ఫరియా అబ్దుల్లా నటిగా అందరికీ పరిచయమే కానీ ఆమెలో హిడెన్ టాలెంట్స్ చాలానే ఉన్నాయి. ఆమె థియేటర్ ఆర్టిస్ట్. ప్లే డిజైనర్ కూడా. అలాగే ఆమె డ్యాన్స్ కూడా చాలా బాగా చేస్తుంది. అయితే ఈ మధ్య చాలా డ్యాన్స్ కాంపిటీషన్స్ , ఈ వెంట్స్ లో సందడి చేస్తూ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.ఈ మధ్య ఫరియా అబ్దుల్లా సుడిగాలి సుదీర్  షో సరిగమప లిటిల్ ఛాంపియన్స్ షో కు హాజరయ్యింది.ఆ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న సుధీర్ తో చాలా సేపు సరదాగా మాట్లాడారు. ఈ షోకు టాప్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, ప్రముఖ లిరిసిస్ట్ అనంత శ్రీరామ్, సింగర్ ఎస్పీ శైలజా జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు.


ఈ సందర్బంగా గెస్ట్ గా వచ్చిన ఫరియాకు సుడిగాలి సుధీర్ గ్రాండ్ వెల్కమ్ చెప్పాడు. కానీ ఫరియా అబ్దుల్లా సుడిగాలి సుధీర్ ను లాగిపెట్టి చెంప మీద కొట్టింది. తన పేరుతో స్వాగతం చెప్పకుండా.. ఐశ్వర్య అంటూ పిలవడంతో ఆమె హార్ట్ అయి సుధీర్ చెంపపై కొట్టింది.దీంతో అందరూ షాక్ అయ్యారు. కాస్త వైరల్ అవుతున్న షో కోసమే కొట్టిందని తెలుస్తుంది. తర్వాత షో కి మిరాయ్ టీం రావడంతో అంతా నార్మల్ అయ్యింది.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu viral-news faria-abdullah

Related Articles