కాంగ్రెస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. మరోసారి పార్టీలో కీలక నేతలు హ్యాండ్ ఇచ్చేందుకు సిద్దమయ్యారా ? ఏకంగా మూడు జిల్లాలోని కేడర్ అంతా ఒకేసారి రాజీనామాకు సిద్ధమైందా ? ఎందుకు రాజీనామా చేస్తున్నారు ? ఏ పార్టీలో చేరేందుకు సిద్దం అవుతున్నారు ?
మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తప్పేలా లేదట. త్వరలోనే ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు హస్తానికి హ్యాండిచ్చి కారు ఎక్కనున్నట్లు తెలుస్తోంది. గులాబీ తీర్థం పుచ్చుకునేందుకు రంగం చేసుకున్నట్లు సమాచారం. ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకి చెందిన ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు కేసీఆర్‌ను కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు మంతనాలు మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది.
ఉమ్మడి జిల్లాలకు చెందిన ఆ ముగ్గురు నేతలు చాలా కాలంగా పార్టీ వ్యవహారంపై తీవ్ర అసహనంతో ఉన్నారట. ప్రభుత్వ మొండి వైఖరి వల్ల ప్రజల్లో రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతోందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ ఉండదని, ప్రజలంతా బీఆర్ఎస్ వైపు ఉన్నారని అంతా బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ నుంచి పర్మిషన్ వచ్చిన వెంటనే ఆ నేతలంతా తమ కార్యకర్తలు, నేతలతో కలిసి మూకుమ్మడిగా చేరాలని భావిస్తున్నట్లు సమాచారం.
రాష్ట్రంలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. రోజురోజుకు ప్రజా వ్యతిరేకత పెరుగుతుండటంతో ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీని విడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నిన్న ఆదివారం రోజున నందినగర్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి కేసీఆర్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరి తప్పు చేశామని, తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు అంగీకరించాలంటూ కోరినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సైతం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలంటూ క్యాడర్ కు పిలుపునిచ్చారు. ఇప్పుడు మరో ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు సైతం అదే దారిలో ఉండటంతో కాంగ్రెస్ కు ఎలక్కాయి ఇరికినంత పని అవుతుందట.
మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు కీలక నేతలు ఒకేసారి పార్టీ వీడెందుకు సిద్ధం అవుతున్నట్లు తెలియడంతో హస్తం పార్టీలో అలజడి మొదలైందటట. వీళ్లతో పాటు మరికొంత మంది ముఖ్య నేతలు సైతం పార్టీ మారే అవకాశాలు ఉన్నట్లు గాంధీభవన్ వర్గాల్లో జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ వైఖరి మారకపోతే చాలా మంది ఇదే దారిలో వెళ్లిన ఆశ్చర్యం అవసరం లేదన్న అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.