సర్కార్ జాబ్స్ పై ఫుల్ క్లారిటీ
క్లారిటీ ఇచ్చిన మహేశ్ గౌడ్
రెండు లక్షల జాబ్ లు ఇక కష్టమేనా..?
ఆహా ఏం క్లారిటీ ఏం క్లారిటీ. మహేశ్ గౌడ్ సార్. ఏం క్లారిటీ ఇచ్చిర్రు సార్. ఓ సార్..నిరుద్యోగులకు కొల్వులు లేక పోవచ్చు. కానీ..సద్వున్నది సార్. మీ మ్యానిఫెస్టో చూశ్న కోట్లమందికి సద్వొచ్చు సార్. దిమాక్ పంజేస్తదనే ఉంది. ఏమంటుండో తెల్షా.
పార్టీ తర్పున తెలంగాణ కాంగ్రెస్ కు పెద్దమన్షి మహేశ్ కుమార్ గౌడ్ సారే గదా. మ్యానిఫెస్టో ల ఏం చెప్పిర్రు. ఇప్పుడేం చేస్తుర్రు అని అడిగితె. ఏం చెబుతుండో తెల్షా. రెండు లక్షల కొల్వులు ఇస్తం అన్నది. ఐదేండ్లలో అంట. అంటే వాళ్ల టర్మ్ అయిపొయ్యేలోపట ఇస్తం అన్నరట. మరి గిదేంది సార్. మ్యానిఫెస్టోల ఏదో ఏడాది లోపే రెండు లక్షల కొల్వులు అని ఉన్నది. ఏడాది లోపే రెండు లక్షల కొల్వులు ఇస్తం అంటెనే గదా..నిరుద్యోగులంత మీ ఎంబడి తిర్గింది. మీకు జేజేలు కొట్టింది. గా మాట తప్పిర్రనే గదా. గీ తీర్ల తర్ముతుర్రు.
నాకు తెల్షి..ఐదేండ్లల్ల రెండులక్షల కొల్వులంటె. ఏడాదికి నలభై వేల కొల్వులైన ఇయ్యాలె. మరి గీ రెండేండ్లల్ల ఇచ్చింది సున్నా. మరి అట్లైన తతిమ్మ మూడేండ్లల్ల ఏడాదికి 70 వేల కొల్వులియ్యాలె. ఇచ్చేతట్లే ఉన్నదా గీ కాంగ్రెస్ సర్కార్ కత చూస్తంటె. ఐదేండ్లల్ల, టర్ము అయిపొయ్యేలోపట అంటుర్రంటె. ఇగో ఇస్తం అగో ఇస్తం అంటరు. నిండా ముంచుతరు. ఈ మున్సిపల్ ఎన్నికలు గానీ అయిపొయ్నయ్ అంటె. కాంగ్రెస్ కు జనంతోని ఏ పనీ ఉండదు. అప్పుడు ఏ మాత్రం ఇస్తడో రేవంత్ సారు. అందర్కి ఎర్కనే. చెప్పెటందుకైన ఉండాలె. రెండు లక్షల కొల్వుల మీద ఇచ్చిన మాటను అంత ఈజీగ ఎట్ల తప్పించుకుంటరో ఏమో గదా. రైతు భరోసా పదిహేను వేలనే..పన్నెండు వేలన్నరు అటెంక. అయ్యి గూడ సక్కగిస్తలేరు. మాట తప్పుడు కాంగ్రెస్ కు వెన్నతోపెట్టిన విద్యనే అనవట్టె జనాలు.