విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రమాదం ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) స్పందిస్తూ సుమోటోగా కేసు నమోదు చేసింది. ఈ పేలుడు ఘటనలో 9 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్ర గాయాలపాలైన సంగతి తెలిసిందే. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్లు కమిషన్ ప్రాథమికంగా గుర్తించింది.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రమాదం ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) స్పందిస్తూ సుమోటోగా కేసు నమోదు చేసింది. ఈ పేలుడు ఘటనలో 9 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్ర గాయాలపాలైన సంగతి తెలిసిందే. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్లు కమిషన్ ప్రాథమికంగా గుర్తించింది. ప్రమాదంపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి జాతీయ మానవ హక్కుల కమిషన్ అధికారిక నోటీసులు జారీ చేసింది. గాయపడిన కార్మికులకు అందుతున్న వైద్య చికిత్స వివరాలు, మృతుల కుటుంబాలకు అలాగే బాధితులకు ప్రభుత్వం, యాజమాన్యం అందజేసిన పరిహారం వివరాలను నివేదికలో స్పష్టం చేయాలని ఆదేశించింది. దీనిని కేవలం ఒక దురదృష్టకర ప్రమాదంగా కొట్టిపారేయలేమని, దీని వెనుక యాజమాన్య నిర్లక్ష్యం, నిధుల కొరత, భద్రతా ప్రమాణాల క్షీణత స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొంది. ప్లాంట్లో అనుభవజ్ఞులైన శాశ్వత ఉద్యోగుల సంఖ్య తగ్గిపోవడం, కీలక విభాగాలలో తక్కువ అనుభవం ఉన్న తాత్కాలిక లేదా కాంట్రాక్ట్ సిబ్బందితో పనులు చేయించడం వల్లనే ఇటువంటి ప్రమాదాలు పునరావృతమవుతున్నాయని ఆందోళన వ్యక్తంచేసింది.